ఆ జీవి నోటిలో 14 వేల దంతాలు.. ఊహకందని రీతిలో వేటాడుతుంది.. ఆ జీవి గురించి తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-20T15:41:19+05:30 IST

ఆ జీవి అందరికీ తెలిసిందే.. దాని నోటిలో 14 వేల దంతాలు..

ఆ జీవి నోటిలో 14 వేల దంతాలు.. ఊహకందని రీతిలో వేటాడుతుంది.. ఆ జీవి గురించి తెలిస్తే..

ఆ జీవి అందరికీ తెలిసిందే.. దాని నోటిలో 14 వేల దంతాలు ఉంటాయి. దాని వేటాడే తీరు అత్యంత ఆసక్తికరం.. ఇంతకీ ఆ జీవి ఏమిటో.. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నత్త తన చుట్టూ బలమైన కాల్షియం కవర్‌ను ఏర్పాటు చేసుకుంటుంది. ‘గార్డియన్’ తెలిపిన వివరాల ప్రకారం నత్తలు దాదాపు 14 వేల దంతాలు కలిగి ఉంటాయి. అవి మానవులు లేదా ఇతర జంతువుల దంతాలకు భిన్నంగా ఉంటాయి. కూరగాయలు, ఆకులను తినడానికి నత్త ఆ దంతాలను ఉపయోగిస్తుంది. నత్త దంతాలు అనేక వరుసల రూపంలో అభివృద్ధి చెందుతాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు పడిపోతుంటాయి. 


వాటి స్థానంలో కొత్త దంతాలు వస్తుంటాయి. వివిధ జాతుల నత్తలలో దంతాల పరిమాణం మారుతూవుటుంది. వీటి సంఖ్యలో కూడా తేడాలుంటాయి. ఉదాహరణకు, కోన్ నత్త వేడి నీటిలో కనిపించే నత్త జాతి.. ఇది చాలా విషపూరితమైనది. ఈ జాతికి చెందిన నత్త ఏదైనా కీటకాన్ని వేటాడేముందు దానిని అపస్మారక స్థితికి తీసుకురావడానికి దాని దంతాలను ఉపయోగిస్తుంది. దంతాలోని విషాన్ని ఆ కీటకంపై ప్రయోగిస్తుంది. కొన్ని జాతుల నత్తలు వానపాములను తినడానికి ఇష్టపడతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎక్కువ దంతాలు కలిగిన జీవుల గురించి చెప్పుకోవాల్సివస్తే ముందుగా నత్త పేరు చెప్పుకోవాల్సిందే! 

Updated Date - 2022-01-20T15:41:19+05:30 IST