Abn logo
Sep 24 2021 @ 00:49AM

ఉపాధి బిల్లుల కోసం ఎన్ని సార్లు తిరగాలి ?

ఎంపీడీఓ వద్ద నేలపై కూర్చుని నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు


-  నేలపై కూర్చుని టీడీపీ నాయకుల నిరసన 

రాప్తాడు, సెప్టెంబరు 23: టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద చేసిన పనుల బిల్లుల కోసం అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరగాలని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలని గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో  ఎంపీడీఓ సాల్మనరాజ్‌, ఈఓఆర్డీ మాధవి ఎదుట వారు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండల వ్యాప్తంగా చేసిన పనులకు దాదాపు రూ. కోటి  బిల్లులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. హైకోర్టు చెప్పినా బిల్లులు చెల్లించడంలో అఽఽధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. బిల్లుల చెల్లింపులు అధికారులే చేయాల్సి ఉన్నప్పటికీ... పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులే బిల్లులు చెల్లించాలని ఎంపీడీఓ చెప్పడం విడ్డూరంగా ఉంద న్నారు. గతంలో అప్పులు చేసి ఉపాధి పనులు చేశామన్నారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉపాధి బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అధికారులు స్పందించి వెంటనే బిల్లులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.   ఈ కార్యక్రమంలో బండమీదపల్లి మాజీ సర్పంచ దగ్గుపాటి శ్రీనివాసులు, నాయకులు రమేష్‌, కాటమయ్య, నారాయ ణ, ముత్యాలప్ప, రాము, వెంకటేష్‌, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.