విడాకుల నేపధ్యంలో భార్యకు బిల్‌గేట్స్ ఎంతిచ్చారు ?

ABN , First Publish Date - 2021-05-05T03:50:38+05:30 IST

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ విడాకుల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బ్రిటన్ రాకుమారుడు ఛార్జెస్, డయానా జంట విడాకులకుంటే గేట్స్ దంపతుల విడాకులే తారస్థాయిలో చర్చనీయాంశంగా మారినట్లు న్యాయూర్క్ పత్రిక వెల్లడించింది.

విడాకుల నేపధ్యంలో భార్యకు బిల్‌గేట్స్ ఎంతిచ్చారు ?

న్యూయార్క్ : మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ విడాకుల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బ్రిటన్ రాకుమారుడు ఛార్జెస్, డయానా జంట విడాకులకుంటే గేట్స్ దంపతుల విడాకులే తారస్థాయిలో చర్చనీయాంశంగా మారినట్లు న్యాయూర్క్ పత్రిక వెల్లడించింది. ఇక గేట్స్ విడాకులకంటే, ఈ సందర్భంగా భార్యకు ఇచ్చిన ఆస్తుల విషయంపైనే ప్రపంచం ద‌ృష్టి ఎక్కువంగా ఉందన్న వ్యాఖ్యానాలూ ఉన్నాయి.


ఇక... బ్లూమ్‍‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదించిన మేరకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కుటుంబం ఆస్తులు 146 బిలియన్ డాలర్లు. భార్యత మెలిండాతో విడాకుల నేపధ్యంలో ఆయన కుటుంబ ఆస్తులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మెలిందా వయస్సు 56. తమ ఫౌండేషన్ కోసం ఈ దంపతులు 50 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు. 


ఆ సంస్థల్లో వాటా... గతంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్-మెకంజీ విడాకులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు బిల్ గేట్స్-మెలిందా విడాకులు ఫిలాంత్రపిక్ ప్రపంచానికి షాకిచ్చాయి. మైక్రోసాఫ్ట్‌లో ప్రస్తుతం గేట్స్ ఆస్తుల వాటి 20 శాతం వరకు ఉండవచ్చని సమాచారం. గతేడాది మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి బయటకు వచ్చిన తర్వాత అతని స్టేక్ గురించిన వివరాలు పూర్తిగా వెల్లడికాలేదు. కాగా... కెనడియన్ నేషనల్ రైల్వే అండ్ డీర్ అండ్ కంపెనీ వంటి పలు ప్రభుత్వ సంస్థల్లో వాటా ఉంది. 


Updated Date - 2021-05-05T03:50:38+05:30 IST