అమరావతి: పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూతూ మంత్రంగా పాస్టర్ ప్రవీణ్‌పై కేసు పెట్టారా అని నిలదీశారు. పాస్టర్ ప్రవీణ్ అమెరికా నుంచి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. ఆ నిధులతో సంఘ వ్యతిరేకశక్తుల ద్వారా.. ఎన్ని దేవాలయాలపై దాడులు చేయించారని కళా వెంకట్రావు నిలదీశారు. ఏడాది నుంచి వందలాది విగ్రహాల ధ్వంసం జరుగుతుంటే.. ఇప్పటి వరకు డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని కళా వెంకట్రావు ప్రశ్నించారు.