Abn logo
Apr 27 2021 @ 00:00AM

ఆక్సిజన్‌ ఏ మేరకు?

ఆక్సిజన్‌ కొరత, కొవిడ్‌ బాధితులకు ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఈ కొరత తలెత్తడానికి సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు లేకపోవడం ఓ కారణమైతే, బాధితుల ఆక్సిజన్‌ ఆవసరం పెరగడం మరో ప్రధాన కారణం. కొవిడ్‌ బాధితులకు వారి ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను బట్టి ఆక్సిజన్‌ అవసరం అవుతుంది. ఆక్సిజన్‌ సిలిండర్‌, బాధితుల అవసరాలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే....


  1. ఒక బల్క్‌ సిలిండర్‌లో 6000 నుంచి 7000 లీటర్ల ఆక్సిజన్‌ ఉంటుంది.
  2. నిమిషానికి 15 లీటర్ల చొప్పున ఫ్లో మీటర్‌లో ఫ్లో రేట్‌ను సెట్‌ చేస్తే, ఒక కొవిడ్‌ బాధితుడికి గంటకు 900 లీటర్ల ఆక్సిజన్‌ అవసరమవుతుంది. ఈ లెక్కన ఒక బల్క్‌ సిలిండర్‌ ఒక బాధితుడికి ఏడు గంటల పాటు ఆక్సిజన్‌ కొరతను తీరుస్తుంది. ఇలా ఒక రోజు/24 గంటలకు ఒక వ్యక్తికి 3.5 నుంచి 4 బల్క్‌ సిలిండర్లు అవసరమవుతాయి.
  3. హై ఫ్రీక్వెన్సీ నాన్‌ ఇన్వేసివ్‌ వెంటిలేటర్ల మీద ఉన్నవారికి నిమిషానికి 30 లీటర్ల ఫ్లో రేట్‌ అవసరం. ఈ కోవకు చెందిన వారికి  గంటకు 1800 లీటర్ల చొప్పున, ఒక బల్క్‌ సిలిండర్‌ కేవలం మూడున్నర గంటలకు సరిపడా ఆక్సిజన్‌ అందించగలుగుతుంది. ఈ లెక్కన ఒక రోజు/24 గంటలకు ఒక వ్యక్తికి సుమారు 7 నుంచి 8 సిలిండర్లు అవసరమవుతాయి.
  4. నిమిషానికి 60 లీటర్ల ఆక్సిజన్‌ అవసరమయ్యే హై ఫ్లో నాసల్‌ కాన్యులా మీద, హై ఫ్లో వెంటిలేటర్ల మీద ఆధారపడిన కొవిడ్‌ బాధితులకు గంటకు 3600 లీటర్ల ఆక్సిజన్‌ అవసరం అవుతుంది. వీళ్లకు ఒక బల్క్‌ సిలిండర్‌ కేవలం గంటన్నర వ్యవధికి సరిపడా ఆక్సిజన్‌ను మాత్రమే అందించగలదు. ఈ కోవకు చెందిన వాళ్లకు ఒక రోజు/24 గంటల పాటు ఆక్సిజన్‌ అందించడానికి కనీసం 16 ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమవుతాయి.

- మాధవ్‌ రెడ్డి, అనస్థటిస్ట్‌


Advertisement
Advertisement
Advertisement