అల్జీమర్స్‌ రాకుండా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2021-09-29T16:18:58+05:30 IST

వయసు పైబడిన వారిలో కనిపించే సమస్య అల్జీమర్స్‌. దీనిబారిన పడిన వారిలో జ్ఞాపకశక్తి లోపించడం వల్ల రోజువారి జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. అయితే ఆహార విధానాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా అల్జీమర్స్‌ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని

అల్జీమర్స్‌ రాకుండా ఉండాలంటే..!

ఆంధ్రజ్యోతి(29-09-2021)

వయసు పైబడిన వారిలో కనిపించే సమస్య అల్జీమర్స్‌. దీనిబారిన పడిన వారిలో జ్ఞాపకశక్తి లోపించడం వల్ల రోజువారి జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. అయితే ఆహార విధానాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా అల్జీమర్స్‌ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని అంటున్నారు పరిశోధకులు. వారు సూచిస్తున్న ఆహార పదార్థాలు ఇవి... 


ఆకుకూరలు, బీన్స్‌, బెర్రీ, సీఫుడ్‌, ఆలివ్‌ ఆయిల్‌, నట్స్‌ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. 


మెదడులో ప్రొటీన్‌ నిర్మాణానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అవసరమవుతాయి. వాల్‌నట్స్‌, ఫ్లాక్స్‌ సీడ్స్‌, ఆలివ్‌ఆయిల్‌లో ఈ ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా లభిస్తాయి. 


ఆరెంజ్‌, బ్రొకోలి, స్ట్రాబెర్రీ, బాదం వంటివి అల్జీమర్‌ డెవలప్‌ అయ్యే అవకాశాలను తగ్గిస్తాయి. 


మెదడులో కెమికల్‌ రియాక్షన్స్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను వీటిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు న్యూట్రలైజ్‌ చేస్తాయి.


ఫ్లేవనాయిడ్స్‌ ఎక్కువగా ఉండే ఆపిల్స్‌, బ్లూబెర్రీ, క్రాన్‌బెర్రీ, గ్రేప్‌ఫ్రూట్స్‌, క్యాబేజీ, వెల్లుల్లి, కిడ్నీబీన్స్‌, పాలకూర, ఉల్లిపాయలు మెనూలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 


పసుపులో ఉండే కుర్‌క్యుమిన్‌ ఆలోచించడం, నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం వంటి కాగ్నిటివ్‌ ఫంక్షన్స్‌ మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని అధ్యయనాల్లో తేలింది.


బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీస్‌ వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సిడెటివ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడటం ద్వారా మెదడు పనితీరు పెరిగేందుకు సహాయపడతాయి. 


Updated Date - 2021-09-29T16:18:58+05:30 IST