ఆత్మవిశ్వాసం పెరగాలంటే..!

ABN , First Publish Date - 2021-05-10T06:25:02+05:30 IST

ఒక వ్యక్తి కూర్చునే విధానాన్ని బట్టి అతని ప్రవర్తన, మానసిక పరిస్థితి అంచనా వేయవచ్చు. లేచినపుడు నిటారుగా నిలబడటం, కళ్లలోకి చూస్తూ మాట్లాడటం వంటివి పాజిటివ్‌ ఇంప్రెషన్‌ను కల్గిస్తాయి

ఆత్మవిశ్వాసం పెరగాలంటే..!

  1. ఒక వ్యక్తి కూర్చునే విధానాన్ని బట్టి అతని ప్రవర్తన, మానసిక పరిస్థితి అంచనా వేయవచ్చు.  లేచినపుడు నిటారుగా నిలబడటం, కళ్లలోకి చూస్తూ మాట్లాడటం వంటివి పాజిటివ్‌ ఇంప్రెషన్‌ను కల్గిస్తాయి.
  2. ఉత్సాహపూరిత ప్రసంగాలను వినడం ద్వారా కాన్ఫిడెన్స్‌ను బిల్డప్‌ చేసుకోవచ్చు. 
  3. నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బంది పడే వారు అద్దం ముందు నిలుచుని మాట్లాడటం ప్రాక్టీసు చేయడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు.
  4. ఇతరులను పొగడటానికి వెనకంజ వేయద్దు. ఇతరుల్లోని గొప్పతనాన్ని చూడటం ద్వారా మీలో ఉన్న గొప్పతనం బయటకు వస్తుంది. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల ఇతరులనూ తక్కువ చేసి చూడటం మొదలవుతుంది. దీన్ని అధిగమించాలంటే ఇతరులను పొగడాల్సిందే.
  5. స్కూల్‌లో, ఆఫీసులో, పబ్లిక్‌ మీటింగ్‌ల్లో వెనక కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటారు. నలుగురి దృష్టిలో పడకుండా ఉండటం కోసమే ఇలా చేస్తుంటారు. ఇది వారిలో ఆత్మవిశ్యాసం లోపించిందనటానికి నిదర్శనం. ఇటువంటి వారు ముందు వరుసలో కూర్చోవడం ద్వారా సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ బిల్డప్‌ చేసుకోవచ్చు. 
  6. గ్రూప్‌ డిస్కషన్లలో మాట్లాడకుండా కూర్చోకూడదు. భయం వల్ల కొందరు అసలు నోరెత్తరు. కానీ అది అనవసర భయమనే విషయాన్ని గుర్తించాలి. అందరిలోనూ ఆ భయం ఉంటుంది. ఎదుటి వాళ్లు ఏమనుకుంటారో అని కూర్చోకుండా మీకు తెలిసిన విషయాన్ని దైర్యంగా చెప్పడం వల్ల  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  7. ప్రతిరోజు వ్యాయామం చేయడం అవసరం. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఉన్నప్పుడే కాన్ఫిడెన్స్‌గా ఉండటం సాధ్యమవుతుంది.
  8. ఒక వ్యక్తి మనోభావాలను దుస్తులు ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఫిజికల్‌ అప్పియరెన్స్‌ ఉండేలా చూసుకోవాలి.

Updated Date - 2021-05-10T06:25:02+05:30 IST