అప్పుడు జుట్టెందుకు ఊడుతుంది?

ABN , First Publish Date - 2020-08-12T21:51:08+05:30 IST

గర్భంతో ఉన్న సమయంలో జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. వేగంగా పొడవు పెరుగుతుంది. కానీ కాన్పయ్యాక రెండు మూడు నెలల నుంచి క్రమేపీ ఊడిపోవడం

అప్పుడు జుట్టెందుకు ఊడుతుంది?

ఆంధ్రజ్యోతి(12-08-2020)

గర్భంతో ఉన్న సమయంలో జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. వేగంగా పొడవు పెరుగుతుంది. కానీ కాన్పయ్యాక రెండు మూడు నెలల నుంచి క్రమేపీ ఊడిపోవడం మొదలవుతుంది. ఒక్కోసారి సగానికి పైగా వెంట్రుకలు రాలిపోతాయి. తల్లితనాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో ఈ మార్పు కాస్త ఆందోళన కలిగిస్తుంది. దీనికి కారణం తెలుసుకుంటే మీ ఆందోళన తగ్గే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో  శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ వంటి హార్మోన్లు, రక్తం పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల వెంట్రుకలకు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దాంతో మెరుపును సంతరించుకుని త్వరగా ఎదుగుతాయి. ప్రసవం అయ్యాక హార్మోన్ల స్థాయులతో పాటూ రక్తం కూడా తగ్గుతుంది. దీంతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఐదారు నెలలు ఇలా జుట్టు ఊడుతూ పలుచబడుతుంది. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా తిరిగి జుట్టును పెంచుకోవచ్చు. ఆకుకూరలు, గుడ్లు, చేపలు, క్యారెట్లు వంటివి తింటే జుట్టు పెరిగే అవకాశం ఉంది. 


Updated Date - 2020-08-12T21:51:08+05:30 IST