కఫం కరగాలంటే?

ABN , First Publish Date - 2021-07-27T18:14:13+05:30 IST

వానాకాలం కఫం సమస్య సర్వసాధారణం. అయితే ఊపిరితిత్తుల్లోని కఫం బయటకొచ్చేవరకూ ఉపశమనం దక్కదు. దాన్ని బయటకి రప్పించటం కోసం ఈ గృహవైద్యం ఉపయోగపడుతుంది. ప్రయత్నించండి.

కఫం కరగాలంటే?

ఆంధ్రజ్యోతి(27-07-2021)

వానాకాలం కఫం సమస్య సర్వసాధారణం. అయితే ఊపిరితిత్తుల్లోని కఫం బయటకొచ్చేవరకూ ఉపశమనం దక్కదు. దాన్ని బయటకి రప్పించటం కోసం ఈ గృహవైద్యం ఉపయోగపడుతుంది. ప్రయత్నించండి.


లెమన్‌ టీ: బ్లాక్‌ టీకి ఒక టీస్పూన్‌ నిమ్మరసం, ఒక టీస్పూన్‌ తేనె కలిపి తాగండి. 


యూకలిప్టస్‌ ఆయిల్‌: కఫాన్ని కరగించే పురాతనమైన గృహ చిట్కా ఇది. కొబ్బరి నూనెలో యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపి ఛాతీ మీద రాసుకోవాలి. 


ద్రాక్ష: ఊపిరితిత్తులకు ఉపశమనాన్నిచ్చి కఫాన్ని అక్కడి నుంచి బయటకి తెప్పించటంలో ద్రాక్ష సమర్థమైనది. కాబట్టి ద్రాక్ష రసం తాగండి.


నిమ్మకాయ: శరీరం నుంచి కఫాన్ని పారదోలాలంటే నిమ్మ చెక్కకు ఉప్పు, మిరియాల పొడి అద్ది నాకుతూ ఉండాలి.


ఉప్పు నీటి పుక్కిలింత: గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక టేబుల్‌స్పూను ఉప్పు కలిపి తలను కొద్దిగా వెనక్కి వంచి ఈ నీళ్లతో నోరు పుక్కిలించాలి. ఇలా చేసిన కొద్ది నిమిషాలకే కఫం వదులై బయటకొస్తుంది.


మిరియాలు, పసుపు: వేడి పాలలో అర టీస్పూను మిరియాల పొడి, చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఉపశమనం కలిగి కఫం కూడా బయటకొస్తుంది.


అల్లం రసం: వేడి నీటిలో ఒక టేబుల్‌స్పూను అల్లం రసం, ఒక టీస్పూను తేనె కలుపుకుని నెమ్మదిగా తాగాలి. 

Updated Date - 2021-07-27T18:14:13+05:30 IST