యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ ఎలా?
ABN , First Publish Date - 2020-11-14T05:30:00+05:30 IST
యూట్యూబ్‌లో ఉన్న ప్రతీ ఛానెల్ ఒక నిర్దిష్టమైన ఇమెయిల్ అడ్రస్‌తో లింక్ అయి ఉంటుంది. అయితే ఆ
మనం యూట్యూబ్‌లో ఒక ఛానెల్‌కి సబ్‌స్క్రయిబ్ చేస్తూ ఉంటాం కదా. దానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ తెలుసుకునే అవకాశం ఉంటుందా?
- భరత్ బత్తుల, నిజామాబాద్
యూట్యూబ్‌లో ఉన్న ప్రతీ ఛానెల్ ఒక నిర్దిష్టమైన ఇమెయిల్ అడ్రస్‌తో లింక్ అయి ఉంటుంది. అయితే ఆ ఈ-మెయిల్ అడ్రస్ వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి యూట్యూబ్ అవకాశం కల్పించదు. కేవలం ఏదైనా పోలీస్ కేస్ అయినప్పుడు మాత్రమే, నేర పరిశోధన సంస్థలకు గూగుల్ ఆ యూట్యూబ్ అకౌంట్ లింక్ అయి ఉన్న మెయిల్ ఐడీ, దాన్ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి తాజా ఐపీ అడ్రస్ వంటి వివరాలు తెలియజేస్తుంది. ఇందులో సాధారణ యూజర్లు చేయగలిగిందేమీ లేదు.
మీ టెక్ సందేహాలకు సమాధానాల కోసం navya@andhrajyothy.com