అపరిచితుడిని తెలుసుకునేదెలా?

ABN , First Publish Date - 2020-11-07T05:30:00+05:30 IST

అపరిచిత వ్యక్తి నుంచి నాకు వాట్సాప్‌లో కొన్ని రోజులుగా మెసేజ్‌లు వస్తున్నాయి. ఆ నెంబర్‌ని ట్రూకాలర్‌లో వెదికినా సరైన వివరాలు చూపించడం లేదు...

అపరిచితుడిని తెలుసుకునేదెలా?

అపరిచిత వ్యక్తి నుంచి నాకు వాట్సాప్‌లో కొన్ని రోజులుగా మెసేజ్‌లు  వస్తున్నాయి.  ఆ నెంబర్‌ని ట్రూకాలర్‌లో వెదికినా  సరైన వివరాలు చూపించడం లేదు.  అతను నాకు మెసేజ్‌ చేయకుండా అడ్డుకోవడం ఎలా,  అసలు ఎవరు మెసేజ్‌ చేస్తున్నారో  తెలుసుకునే మార్గం ఉందా? 

- ఇస్మాయిల్‌ 


పబ్లిక్‌గా  పలుచోట్ల ఫోన్‌ నెంబర్‌ ఇచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీకు వస్తున్నది మార్కెటింగ్‌ మెసేజ్‌లు కాదు. కాబట్టి,  ఎక్కడైనా పబ్లిక్‌గా మీరు మీ నెంబర్‌ ఉంచినప్పుడు గానీ, లేదా ఏదైనా వాట్సాప్‌ గ్రూప్‌లో భాగంగా ఉన్నప్పుడు గానీ మీ నెంబర్‌ ఎవరైనా సేకరించి ఇలా మెసేజ్‌ పంపిస్తూ ఉండొచ్చు.  అలాంటప్పుడు మీరు ఉన్న ఫళంగా  చేయగలిగేది ఆ నెంబర్‌ను బ్లాక్‌ చేయడం.  ఒకవేళ మీరు కోరినట్లు ఆ నెంబర్‌ ఎవరిదో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా పోలీస్‌ కంప్లయింట్‌ ఫైల్‌ చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆ నెంబర్‌ వివరాలను వారి వద్ద ఉండే ప్రత్యేకమైన డేటాబేస్‌ ద్వారా తెలుసుకుంటారు. అవసరాన్ని బట్టి ట్రాక్‌ చేసి వారు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో  తెలుసుకోగలరు. కాకపోతే మీకు పెద్దగా ఇబ్బంది లేకపోతే కేవలం బ్లాక్‌ చేసి వదిలేస్తే సరిపోతుంది.  మరీ సమస్య ఎక్కువగా ఉంటే పోలీసులను ఆశ్రయించండి.




Updated Date - 2020-11-07T05:30:00+05:30 IST