వైఫై పాస్‌వర్డ్‌ తెలుసుకోవచ్చా -టెక్ సందేహాలు

ABN , First Publish Date - 2020-06-27T05:30:00+05:30 IST

వైఫై పాస్‌వర్డ్‌ తెలుసుకోవచ్చా? ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో సేవ్‌ అయిన వైఫై పాస్‌వర్డ్‌లను తెలుసుకునే అవకాశం ఉంటుందా?...

వైఫై పాస్‌వర్డ్‌ తెలుసుకోవచ్చా -టెక్ సందేహాలు

వైఫై పాస్‌వర్డ్‌ తెలుసుకోవచ్చా? ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో సేవ్‌ అయిన వైఫై పాస్‌వర్డ్‌లను తెలుసుకునే అవకాశం  ఉంటుందా? 

- ప్రదీప్‌


ఆండ్రాయిడ్‌ ఫోన్‌ రూట్‌ చేసినప్పుడు మాత్రమే సహజంగా ఇది సాధ్యపడుతుంది. మనం గతంలో ఎంటర్‌ చేసిన వైఫై పాస్‌వర్డ్‌లు అన్నీ మన ఫోన్‌లో డేటా/మిస్‌/వైఫై అనే ఫోల్డర్‌లో భద్రంగా ఉంటాయి. రూట్‌ యాక్సెస్‌ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రదేశానికి వెళ్ళటానికి వీలవుతుంది. అయితే సూపర్‌ మేనేజర్‌ లేదా రూట్‌ ఎక్స్‌ప్లోరల్‌ అనే రెండు ప్రత్యేకమైన అప్లికేషన్‌ల సాయంతో మీ వైఫై పాస్‌వర్డ్‌ తెలుసుకోవచ్చు.


Updated Date - 2020-06-27T05:30:00+05:30 IST