క్రెడిట్‌ స్కోర్‌ లేకున్నా రుణం పొందడమెలా..?

ABN , First Publish Date - 2021-01-10T07:12:16+05:30 IST

ఆర్థిక అత్యవసరం చెప్పిరాదు. ఆ సమయంలో మీ వద్ద తగినంత సొమ్ము ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అప్పు చేయాల్సి వస్తే..? అందుకు బ్యాంకే ప్రత్యామ్నాయమైతే,

క్రెడిట్‌ స్కోర్‌ లేకున్నా రుణం పొందడమెలా..?

ఆర్థిక అత్యవసరం చెప్పిరాదు. ఆ సమయంలో మీ వద్ద తగినంత సొమ్ము ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అప్పు చేయాల్సి వస్తే..? అందుకు బ్యాంకే ప్రత్యామ్నాయమైతే, ముందుగా మీకు ఉండాల్సింది మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌. ఎందుకంటే, మంచి క్రెడిట్‌ స్కోర్‌ లేని వారికి రుణాలిచ్చేందుకు బ్యాంక్‌లు ఆసక్తి చూపవు. అలాంటప్పుడు బ్యాంకర్‌ను మెప్పించడం సవాలే అయినప్పటికీ అసాధ్యమేమీ కాదు. క్రెడిట్‌ స్కోర్‌ అంతంత మాత్రంగా ఉన్నా రుణం పొందవచ్చిలా..


ఈఎంఐ చెల్లించగలరన్న భరోసా కల్పించాలి.. 

 క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నప్పటికీ, మీ ప్రస్తుత ఆదాయంతో నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) చెల్లించగలరన్న భరోసా లభిస్తే బ్యాంక్‌ మీకు రుణం ఇచ్చేందుకు ముందుకు రావచ్చు. కాకపోతే, వడ్డీ కాస్త అధికంగా చెల్లించాల్సి రావచ్చు. 


తక్కువ రుణం.. మంజూరు సులభం 

రుణం ఎంత తక్కువగా తీసుకుంటే.. మంజూరుకు అవకాశాలు అంతగా మెరుగుపడతాయి. ఈ వ్యూహాన్ని పాటిస్తే.. క్రెడిట్‌ స్కోర్‌ అందుబాటులో లేకున్నా రుణం లభించే అవకాశముంటుంది. 


సహ దరఖాస్తుదారు లేదా హామీదారును చేర్చండి.. 

మీ లోన్‌ అప్లికేషన్‌లో ఎవరినైనా సహ దరఖాస్తుదారు లేదా హామీదారుగా చేర్చగలిగితే సులభంగా రుణం పొందవచ్చు. ఆ వ్యక్తి మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ కలిగి ఉండటం మరింత మేలు. 


క్రెడిట్‌ స్కోర్‌లో తప్పులున్నాయేమో సమీక్షించుకోండి.. 

మీ క్రెడిట్‌ స్కోర్‌లో తప్పులుండే అవకాశాల్లేకపోలేవు. లేదంటే, అప్‌డేట్‌ అయి ఉండకపోవచ్చు. వీటిని సరిదిద్దుకోవడం ద్వారానూ రుణం పొందేందుకు అవకాశాలు మెరుగు పర్చుకోవచ్చు.    


Updated Date - 2021-01-10T07:12:16+05:30 IST