లాక్‌ డౌన్‌ వేళ బయట తిరుగుదాం.. రా!

ABN , First Publish Date - 2020-05-12T22:29:51+05:30 IST

జనాల ఒంట్లో విటమిన్‌ డి తక్కువగా ఉండడం వల్లే ఇటలీలోనూ స్పెయిన్‌లోనూ కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువయిందని ఓ పరిశోధకుడు తేల్చాడు.

లాక్‌ డౌన్‌ వేళ బయట తిరుగుదాం.. రా!

జనాల ఒంట్లో విటమిన్‌ డి తక్కువగా ఉండడం వల్లే ఇటలీలోనూ స్పెయిన్‌లోనూ కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువయిందని ఓ పరిశోధకుడు తేల్చాడు. మరి డి విటమిన్‌ రావాలంటే లాక్‌ డౌన్‌లో అయినా బయట తిరగాలంటాడు బాబ్జీ. మరి అసలు పరిష్కారం ఏంటి?


The researchers said there is an association between low levels of vitamin D and susceptibility to acute respiratory tract infections and low levels of Vitamin D could be the reason why Italy and Spain got effected badly. Going out for vitamin D in lock down time is not the solution. What else?


టెక్‌ టాక్‌ : బయట తిరుగుదాం.. రా!


రాంజీ : ఏరా బాబ్జీ ఇది విన్నావా?

బాబ్జీ : అస్తమానూ నువ్వు చెప్పేది నేను వినడం కాదు. ఈసారి నువ్ విను.


రాంజీ : సరే. చెప్పు. ఏంటి విషయం?

బాబ్జీ : కాసేపలా బయట తిరిగొద్దాం పద.


రాంజీ : బయట తిరుగుతావా? అదేట్రా? లాక్‌డౌన్లో ఉన్నాం ఆ సంగతి మరిచిపోయావా?

బాబ్జీ : తెలుసులేరా. కానీ తప్పదు. తిరగాల్సిందే.


రాంజీ : ఏంట్రా నువ్వనేది? బయట తిరిగితే వైరస్‌ ప్రాబ్లెమ్‌ కదా?

బాబ్జీ : అదే నాకు అర్థం కావట్లేదురా.. వైరస్‌ ప్రాబ్లెమ్‌... బయట తిరిగితే ఎక్కువా? తిరగకపోతే ఎక్కువా అని...


రాంజీ : అదేం డౌటు? బయట తిరిగితేనే ఎక్కువ ప్రాబ్లెము...

బాబ్జీ : కానీ అదేంటి? ఆ స్మిత్‌ గాడు అలా అంటాడు?


రాంజీ : ఎవడ్రా ఆ స్మిత్‌ గాడు?

బాబ్జీ : సైంటిస్ట్‌ రా... లీ స్మిత్‌ అనీ... యూకేలో ఆంగ్లిన్‌ రస్కిన్‌ యూనివర్సిటీలో ఉంటాడు.


రాంజీ : ఏవంటాడేంటి?

బాబ్జీ : బయట తిరక్కపోతేనే డేంజరట.


రాంజీ : అదేంట్రా బాబూ?

బాబ్జీ : మనోడు ఓ గొప్ప పరిశోధన చేశాడ్లే. ఒంట్లో విటమిన్‌ డీ తక్కువుంటే కరోనా వైరస్‌ తో డేంజరెక్కువట.


రాంజీ : అవునా? ఎందుకట?

బాబ్జీ : ఎందుకేంటి? ఒంట్లో డీ విటమిన్‌ లేకపోతే ఊపిరి సమస్యలు రావచ్చు. మరి కరోనాకీ ఊపిరికీ కనెక్షనుంది కదా? అందుకే బయట తిరగాల్సిందే!


రాంజీ : ఎవడ్రా ఆ స్మిత్‌ గాడు? ఏంటా పరిశోధన? ఇంతకీ ఏం అంటాడు? అసలే జనం నానా న్యూసూ చదివి కలవరపడుతున్నారు. మళ్లీ నువ్వు కొత్తగా ఇంకో న్యూసెన్స్‌ తేవద్దు.

బాబ్జీ : న్యూసెన్స్‌ కాదురా. న్యూసే! యూరప్‌ కంట్రీల్లో జనాల బాడీల్లో డీవిటమిన్‌ గురించి పరిశోధన చేశారట... దాంతో ఓ గొప్ప లింక్‌ బయటపడింది.


రాంజీ : ఏంటా లింకు?

బాబ్జీ : చెప్పానుగా? ఒంట్లో డీ విటమిన్‌ తక్కువున్నవాళ్లకే కరోనా వైరస్‌ బారిన పడ్డానికి ఛాన్సెక్కువని...


రాంజీ : అలా ఎలా చెబుతారు?

బాబ్జీ : ప్రూఫు లేకుండా చెప్పడం లేదులే. ఫరెగ్జాంపుల్‌... అక్కడ యూరప్‌లో ఇటలీ స్పెయిన్‌ .. కరోనా వల్ల బాగా దెబ్బ తిన్నాయి తెలుసు కదా?


రాంజీ : అవును పాపం.

బాబ్జీ : మరి ఆ దేశాలు ఎందుకంత దెబ్బ తిన్నాయో తెలుసా?


రాంజీ : ఎందుకట?

బాబ్జీ : అక్కడ జనాల బాడీల్లో విటమిన్‌ డీ లెవెల్స్‌ తక్కువట. చాలా యూరోపియన్‌ దేశాల కంటే - అక్కడ ఏవరేజ్‌ విటమిన్‌ డీ లెవెల్స్‌ తక్కువని పరిశోధనలో తేలింది.


రాంజీ : అయితే ఏంటంటావ్‌? కరోనాకీ.. బాడీలో డీ విటమిన్‌ లెవెల్స్‌కీ డైరెక్ట్‌ లింకుందంటావ్‌.

బాబ్జీ : అవున్రా. అందుకే బయటికి రమ్మనేది. కాస్త మనం ఎండలో బయట తిరిగితే డీ విటమిన్‌ని బాగా క్యాచ్‌ చేయచ్చు. కరోనాని ఈజీగా ఎదుర్కోవచ్చు. ఇలా ఇంట్లోనే కూర్చుని ఉంటే … డీ విటమిన్‌ క్యాచ్‌ చెయ్యలేం. పద పద.


రాంజీ : బావుంది. ఈమాత్రం దానికి ఈ లాక్‌ డౌన్‌ టైములో బయటేం తిరిగేయక్కర్లేదు. అంత డీ విటమిన్నే కావాలంటే … అదుగో కిటికీ దగ్గర కాస్త ఎండ తగిలేలా కూర్చుని ఓ గ్లాసుడు పాలు తాగు. అర్థమయిందా?

బాబ్జీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )


వీడియో ఇక్కడ చూడండి:





Updated Date - 2020-05-12T22:29:51+05:30 IST