సర్జరీ తరువాత త్వరగా కోలుకోవాటంటే..?

ABN , First Publish Date - 2021-08-06T18:40:54+05:30 IST

ఆపరేషన్‌ జరిగిన తరువాత త్వరగా కోలుకోవాలన్నా, గాయం త్వరగా మానాలన్నా ఆరోగ్యకరమెన ఆహారం తీసుకోవడం అవసరం. కెలోరీలు, ప్రొటీన్లు, విటమిన్లు, కొన్ని రకాల ఖనిజాలు అధికమోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొటీన్ల కోసం

సర్జరీ తరువాత త్వరగా కోలుకోవాటంటే..?

ఆంధ్రజ్యోతి(06-08-2021)

ప్రశ్న: నాకు ఇటీవలే సర్జరీ అయింది. ఆ గాయాన్ని ఎలాంటి ఆహారంతో త్వరగా మానేలా చేయవచ్చు?


- నాగరాజు, కరీంనగర్‌


డాక్టర్ సమాధానం: ఆపరేషన్‌ జరిగిన తరువాత త్వరగా కోలుకోవాలన్నా, గాయం త్వరగా మానాలన్నా ఆరోగ్యకరమెన ఆహారం తీసుకోవడం అవసరం. కెలోరీలు, ప్రొటీన్లు, విటమిన్లు, కొన్ని రకాల ఖనిజాలు అధికమోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొటీన్ల కోసం కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌, చేప, గుడ్లు, అన్నిరకాల పప్పుధాన్యాలు తీసుకోవాలి. కూరగాయలలో ఉండే ఖనిజాలు గాయం త్వరగా మానేందుకే గాక, అందులోని పీచుపదార్థాల ద్వారా మలబద్దకం రాకుండా నివారిస్తాయి. ఐరన్‌ అధికంగా ఉండే ఆకుకూరలు, రాజ్మా, నల్లశనగలు, ఉలవలు లాంటివి  తరచూ తింటూ ఉండాలి. శక్తిని, యాంటీ ఆక్సిడెంట్స్‌ను అధికంగా అందించే పండ్లను రోజుకు రెండుసార్లైనా తీసుకోవాలి. గాయానికి తిరిగి ఇన్‌ఫెక్షన్‌ కాకుండా ఉండడానికి విటమిన్‌- సి అధికంగా ఉండే నిమ్మ, నారింజ పండ్ల రసాలను తీసుకోవాలి. మంచి ఆహారంతో పాటు తప్పని సరిగా శరీరానికి విశ్రాంతినిస్తే త్వరగా కోలుకునేందుకు అవకాశం ఎక్కువ. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail కు పంపవచ్చు)

Updated Date - 2021-08-06T18:40:54+05:30 IST