స్టోరేజ్‌ పెరగాలంటే ఎలా?

ABN , First Publish Date - 2020-03-21T06:23:59+05:30 IST

పెద్ద పరిమాణంలో ఉన్న వీడియోలు తప్పించి సహజంగా వాట్సప్‌ ఫొటోలు, టెక్ట్స్‌, వాయిస్‌ క్లిప్‌లు పెద్దగా స్టోరేజ్‌ ఆక్రమించవు. మీ ఫోన్‌లో స్టోరేజ్‌ స్పేస్‌ నిండిపోవటానికి ఇతర అప్లికేషన్లు గానీ, వాటి ద్వారా క్రియేట్‌ అయ్యే కంటెంట్‌ గానీ

స్టోరేజ్‌ పెరగాలంటే ఎలా?

నేను సామ్‌సంగ్‌ ఆన్‌ 7 ప్రో ఫోన్‌ వాడుతున్నాను. వాట్సప్‌లో అన్నీ డిలీట్‌ చేసినా స్టోరేజ్‌ స్పేస్‌ ముందు ఉన్నంతే ఉంటోంది.  స్టోరేజ్‌ పెరగాలంటే ఏం చేయాలి? 

- శ్రీనివాసరావు,  అవనిగడ్డ

పెద్ద పరిమాణంలో ఉన్న వీడియోలు తప్పించి సహజంగా వాట్సప్‌ ఫొటోలు, టెక్ట్స్‌, వాయిస్‌ క్లిప్‌లు  పెద్దగా స్టోరేజ్‌ ఆక్రమించవు.  మీ ఫోన్‌లో స్టోరేజ్‌ స్పేస్‌ నిండిపోవటానికి ఇతర అప్లికేషన్లు గానీ, వాటి ద్వారా క్రియేట్‌ అయ్యే కంటెంట్‌ గానీ కారణం కావచ్చు. అసలు మీ ఫోన్‌లో ఏ ఫైళ్లు, ఫోల్డర్లు ఎక్కువ స్థలం ఆక్రమిస్తున్నాయో విశ్లేషించడం ద్వారా..  అనవసరమైన వాటిని గుర్తించి తొలగించడం ద్వారా స్పేస్‌ లభిస్తుంది. దీనికోసం దాదాపు అన్ని ఫోన్లలో  ఫైల్‌ మేనేజర్‌ యాప్స్‌లో స్టోరేజ్‌ స్పేస్‌ని  విశ్లేషించే సదుపాయం ఉంటుంది.  అది ప్రయత్నించండి.  ఒకవేళ మీ ఫోన్‌లో అలాంటి సదుపాయం లేకపోతే  గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి స్టోరేజ్‌ అనలైజర్‌ అండ్‌ డిస్క్‌ యూసేజ్‌ అనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రయత్నించండి.

Updated Date - 2020-03-21T06:23:59+05:30 IST