ఇమ్యూనిటీని పెంచుకోవచ్చా? అది ఎలా..

ABN , First Publish Date - 2020-03-21T14:09:27+05:30 IST

ఇప్పుడున్న వైరస్‌ భయాల వల్ల రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెంచుకోవడం, శుభ్రత పాటించడం, పబ్లిగ్గా తిరగకుండా ఉండటం చేయమని మీడియాలో వస్తోంది. ఇమ్యూనిటీ అనేది చిన్నప్పటి

ఇమ్యూనిటీని పెంచుకోవచ్చా? అది ఎలా..

ఆంధ్రజ్యోతి(21-03-2020)

ఇమ్యూనిటీ సలాడ్‌

ప్రశ్న: ఇప్పుడున్న వైరస్‌ భయాల వల్ల రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెంచుకోవడం, శుభ్రత పాటించడం, పబ్లిగ్గా తిరగకుండా ఉండటం చేయమని మీడియాలో వస్తోంది. ఇమ్యూనిటీ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా! ఇప్పుడే వెంటనే ఇమ్యూనిటీ పెరగాలంటే ఎలా కుదురుతుంది. నిజంగా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చా? అయితే ఎలా?


-వర్మ, హైదరాబాద్‌


సమాధానం: మనం పుట్టినప్పటి నుంచి, కొంత వయసు వచ్చేదాకా మన డిఫెన్స్‌ సిస్టమ్‌ అంటే ఇమ్యూనిటీ వృద్ధి అనేది జరుగుతుంది. ఇది వ్యక్తి ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లు, శుభ్రత, ఉండే ప్రదేశం బట్టి ఉంటుంది. మనిషి చనిపోయేవరకు రోగనిరోధక శక్తి పోరాడుతూనే ఉంటుంది. ఇప్పుడు వైరస్‌ వచ్చింది. దానికి విరుగుడు ఇంకా లేదు కాబట్టి రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటాం. ఎప్పుడైనా సరే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు.  దీనికి చేయాల్సిందల్లా...


ప్రతిరోజూ సాఫీగా విరోచనం అయ్యేలా చూసుకోవాలి. దీని కోసం తగినన్ని నీళ్లు, తగినంత పీచుపదార్థం ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పేగుల్లో మలినాలు తొలగి, విషపదార్థాలు లేకుండా ఉంటాయి. మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. జీర్ణకోశం నుంచే రోగనిరోధక కణాలు పుడతాయి కాబట్టి జీర్ణకోశ ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యం. జీర్ణకోశ ఆరోగ్యానికి ఈ సలాడ్‌ తీసుకోండి. ప్రతిరోజూ ఈ సలాడ్‌ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 


కావాల్సినవి: బొప్పాయి పండు ముక్కలు ఒక కప్పు, టొమాటో ముక్కలు ఒక కప్పు, సన్నగా తిరిగిన చిన్న పచ్చి మిరపకాయ ఒకటి, సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క. సన్నగా తరిగిన పసుపు ముక్క, సన్నగా తరిగిన ఒక వెల్లుల్లి, సైంధవ లవణం కొద్దిగా, నిమ్మరసం ఒక స్పూను, సన్నగా తరిగిన కొత్తిమీర, నువ్వుల నూనె  ఒక చుక్క, పటిక బెల్లం లేదా పంచదార ఒక స్పూను.


తయారీ: వీటన్నింటిని ఒక బౌల్‌లో బాగా కలిపి ప్రతిరోజూ ఈవెనింగ్‌ స్నాక్‌లా తినాలి.

మధుమేహం, బీపీ ఉన్నవారు కూడా ఈ సలాడ్‌ను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు.

Updated Date - 2020-03-21T14:09:27+05:30 IST