వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తుంటే..!

ABN , First Publish Date - 2020-08-08T06:05:32+05:30 IST

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ కోసం అనేక రకాల ఎక్స్‌టెన్షన్స్‌ లభిస్తున్నాయి. కొంత సమయం పాటు నిర్ధిష్టమైన వెబ్‌సైట్లు ఓపెన్‌ కాకుండా వీటిని ఉపయోగించవచ్చు. లేదా విండోస్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోగలిగే ‘‘ఫోకస్‌మి’’ అనే అప్లికేషన్‌ ప్రయత్నించవచ్చు...

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తుంటే..!

ఇప్పుడు నేను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నాను. ఉద్యోగ రీత్యా ఎక్కువ సమయం కంప్యూటర్‌ మీద గడుపుతుంటాను. ఓపెన్‌ చేసి పెట్టిన వివిధ రకాల అప్లికేషన్స్‌, బ్రౌజర్‌ ట్యాబ్స్‌ వల్ల పని మీద నుంచి దృష్టి మళ్లుతోంది. ఎక్కువ ప్రొడక్టివిటీ సాధించడం కోసం  సూచనలు ఇవ్వగలరు. 

- మైత్రి


గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ కోసం అనేక రకాల ఎక్స్‌టెన్షన్స్‌ లభిస్తున్నాయి. కొంత సమయం పాటు నిర్ధిష్టమైన వెబ్‌సైట్లు ఓపెన్‌ కాకుండా వీటిని ఉపయోగించవచ్చు. లేదా విండోస్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోగలిగే ‘‘ఫోకస్‌మి’’ అనే అప్లికేషన్‌ ప్రయత్నించవచ్చు. దీని ద్వారా వెబ్‌సైట్లు మాత్రమే కాకుండా, మీ కంప్యూటర్‌లో అనవసరమైన అప్లికేషన్స్‌ ఓపెన్‌ చేయకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో వివిధ రకాల రూల్స్‌ సెట్‌ చేసుకుని, అవసరాన్ని బట్టి వాటిని అప్పటికప్పుడు యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ‘పొమొడోరో’ టైమర్‌ వంటి ఆప్షన్లు కూడా ఈ అప్లికేషన్‌లో లభిస్తుంటాయి. అలాగే కంప్యూటర్‌ మీద ఎంత సమయం గడిపారో పూర్తి వివరంగా రిపోర్టులను కూడా అందిస్తుంది.


Updated Date - 2020-08-08T06:05:32+05:30 IST