Abn logo
Sep 29 2021 @ 00:31AM

బియ్యం తూకాలు తక్కువగా వేస్తే ఎలా.?

అనంతపురం అర్బన ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఎఫ్‌పీ షాపు డీలర్లు- ఎఫ్‌పీ షాపు డీలర్ల నిరసన

అనంతపురం వ్యవసాయం / రూరల్‌, సెప్టెంబరు 28 : బియ్యం తూకాలు తక్కువగా వేస్తే ఎలాగంటూ ఎఫ్‌పీ షాపు డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక అనంతపురం అర్బన ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద ఎఫ్‌పీ షాపు డీలర్ల సంఘం నాయకులు నరసింహులు, చెన్నారెడ్డి, లాలెప్ప ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఒక్కో బస్తాలో 2 నుంచి 4 కేజీలు తక్కువగా తూకాలు వస్తున్నాయన్నారు. ఎండీయూలు తమను ప్రశ్నిస్తున్నారని, ఇప్పటి నుంచి తూకాలు ఖచ్చితంగా వేయాలని కోరారు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని బియ్యం తక్కువ తూకాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.