అధిక బరువు తగ్గాలంటే?

ABN , First Publish Date - 2021-07-20T16:33:19+05:30 IST

అధిక బరువును తగ్గించడం కోసం క్యాలరీలలో కోత విధించడం ఒక్కటే కాదు. తీసుకునే ఆహారం పట్ల అప్రమత్తత, ఒత్తిడి తగ్గించడం, సరైన జీవనవిధానం పాటించడం మొదలైన నియమాలు పాటించాలి. ఇందుకోసం ఆయుర్వేద ఆహారపుటలవాట్లు కూడా కొంతమేరకు తోడ్పడతాయి.

అధిక బరువు తగ్గాలంటే?

ఆంధ్రజ్యోతి(20-07-2021)

అధిక బరువును తగ్గించడం కోసం క్యాలరీలలో కోత విధించడం ఒక్కటే కాదు. తీసుకునే ఆహారం పట్ల అప్రమత్తత, ఒత్తిడి తగ్గించడం, సరైన జీవనవిధానం పాటించడం మొదలైన నియమాలు పాటించాలి. ఇందుకోసం ఆయుర్వేద ఆహారపుటలవాట్లు కూడా కొంతమేరకు తోడ్పడతాయి. 


భారీ మధ్యాహ్న భోజనం: రాత్రికి బదులుగా మధ్యాహ్నం భోజనం భారీగా తినాలని ఆయుర్వేదం సూచిస్తోంది. సాధ్యమైనన్ని ఎక్కువ క్యాలరీలను మధ్యాహ్న భోజనం ద్వారా తీసుకోవడం వల్ల, దాన్ని పూర్తిగా జీర్ణం చేసుకుని, పోషకాల శోషణతో శక్తిని సమకూర్చుకోగల సమయం జీర్ణవ్యవస్థకు చిక్కుతుంది. రాత్రి వేళ అజీర్తికి, ఉబ్బరానికి తావు లేకుండా వీలైనంత తక్కువ ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్‌, కొవ్వులు, పిండిపదార్థాలు సరిపడా తీసుకోవాలి. అన్నం, పప్పు, కూరలు, సలాడ్స్‌ తీసుకోవచ్చు. లంచ్‌లో పెరుగు, నెయ్యి కూడా తినాలి.


గోరువెచ్చని నీళ్లు: రోజు మొత్తం రెండు నుంచి మూడు లీటర్ల గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల అధిక బరువు తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది. గోరువెచ్చని నీళ్లు కొవ్వును విరిచి, మాలిక్యూల్స్‌గా మారుస్తాయి. జీర్ణవ్యవస్థ వీటిని శక్తిగా వాడుకోగలుగుతుంది. గోరువెచ్చని నీళ్లతో మెటబాలిజం కూడా పెరుగుతుంది. భోజనానికి అరగంట ముందు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఆకలి అదుపులో ఉండి, అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకుండా ఉంటాయి.


కషాయం: ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో వేయించిన మెంతులు కలిపి పరగడుపున తాగాలి. మెంతుల్లోని పీచు, జీర్ణశక్తికీ, మలబద్ధకం నివారణకూ తోడ్పడుతుంది. త్రిఫల చూర్ణం కూడా అధిక బరువును తగ్గిస్తుంది.

Updated Date - 2021-07-20T16:33:19+05:30 IST