వర్క్ ఫ్రం హోం వల్ల బరువు పెరుగుతున్నారా..?

ABN , First Publish Date - 2020-09-16T19:21:59+05:30 IST

ఇంటి నుండే పని చేయడం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం లేదు. ఈ సమయంలో బరువు పెరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

వర్క్ ఫ్రం హోం వల్ల బరువు పెరుగుతున్నారా..?

ఆంధ్రజ్యోతి(16-09-2020)

ప్రశ్న: ఇంటి నుండే పని చేయడం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం లేదు. ఈ సమయంలో బరువు పెరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?


- స్నేహ, కరీంనగర్‌


డాక్టర్ సమాధానం: శారీరక శ్రమ లేకపోతే బరువు పెరగడంతో పాటు జీవనశైలికి సంబంధించిన వ్యాధులైన బీపీ, షుగరు, హై కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడే అవకాశం లేకపోలేదు. ఇంటి నుండి పని చేసేప్పుడు ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఓ సమయం నిర్ధారించుకుని కేవలం అప్పుడు మాత్రమే ఆహారం తీసుకోండి. ఊసుపోక, బోర్‌ కొట్టి తినే అలవాటు మానుకోవాలి. ఆఫీసు పని కానీ, టీవీలు, ఫోనులు చూస్తూ తింటే ఎక్కువగా భోంచేసే ప్రమాదం ఉంది. అలాగే పండ్లు, గింజలు లాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తప్ప బిస్కెట్స్‌, వేయించిన చిరుతిళ్ళు, స్వీట్స్‌ను అందుబాటులో పెట్టుకోకూడదు. పిల్లలకు కూడా పాలు, పండ్లు, మొలకెత్తిన ఉడికించిన గింజలతో చేసిన చాట్‌, ఆమ్లెట్‌, సూప్స్‌ స్నాక్స్‌గా ఇవ్వాలి తప్ప జంక్‌ ఫుడ్స్‌ వద్దు. శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పుడు క్యాలోరీలు కూడా తగ్గించకపోతే నెమ్మదిగా బరువు పెరుగుతారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసేప్పుడు ఆఫీసు ప్రయాణాలు తగ్గుతాయి. కాబట్టి రోజూ కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)




Updated Date - 2020-09-16T19:21:59+05:30 IST