సముద్రపు దొంగల పడవ

ABN , First Publish Date - 2020-05-13T06:06:46+05:30 IST

సముద్రపు దొంగలు ఉపయోగించే పడవ ఎలా ఉంటుందో సినిమాల్లో చూసే ఉంటారు కదా! అలాంటి పడవను ఈరోజు తయారుచేద్దాం. ఇంట్లో లభించే వస్తువులతోనే దీన్ని తయారుచేయవచ్చు...

సముద్రపు దొంగల పడవ

సముద్రపు దొంగలు ఉపయోగించే పడవ ఎలా ఉంటుందో సినిమాల్లో చూసే ఉంటారు కదా! అలాంటి పడవను ఈరోజు తయారుచేద్దాం. ఇంట్లో లభించే వస్తువులతోనే దీన్ని తయారుచేయవచ్చు. 


కావలసినవి

  1. కోడిగుడ్లు పెట్టే అట్ట పెట్టె
  2. పొడవైన పుల్లలు (గట్టివి)
  3. రంగుల ఛార్ట్‌ పేపర్స్‌
  4. కత్తెర
  5. రంగులు
  6. పెయింట్‌ బ్రష్‌ 
  7. సముద్రపు దొంగల థీమ్‌ స్టిక్కర్స్‌ లేదా ప్రింటవుట్స్‌
  8. జిగురు


తయారీ

  1. డజను గుడ్లు పట్టే ఎగ్‌ కార్టన్‌ తీసుకోవాలి. పై భాగం అవసరం లేదు కాబట్టి తీసేయాలి.
  2. కింది భాగానికి పెయింట్‌ బ్రష్‌తో రంగు వేయాలి.
  3. రంగు పేపర్లను తెరచాపలుగా కట్‌ చేయాలి. వాటికి థీమ్‌ స్టిక్కర్స్‌ అతికించాలి.
  4. రెండు పుల్లలు తీసుకుని బేస్‌ భాగంలో జిగురు సహాయంతో అతికించాలి.
  5. తరువాత ఆ పుల్లలకు స్టిక్కర్స్‌ అతికించిన కలర్‌  పేపర్లను (తెరచాపలు) అంటించాలి.
  6. మీ దగ్గర సముద్రపు దొంగల బొమ్మలు ఏవైనా ఉంటే వాటిని షిప్‌లో పెట్టొచ్చు. ఫ ఈ బొమ్మ మీరు ఆడుకోవడానికే కాదు ఇంట్లో షెల్ఫ్‌ల అలంకరణ కోసం కూడా పనికొస్తుంది.

Updated Date - 2020-05-13T06:06:46+05:30 IST