కార్పెట్‌ క్లీనింగ్‌ ఇలా..!

ABN , First Publish Date - 2021-04-05T05:40:10+05:30 IST

ఇంటిని శుభ్రం చేసుకోవడం ఈజీ టాస్క్‌ కాదు. ముఖ్యంగా కార్పెట్‌ క్లీన్‌ చేయడం ఎంతో శ్రమతో కూడుకుని ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులువుగా పని పూర్తి చేసుకోవచ్చు.

కార్పెట్‌ క్లీనింగ్‌ ఇలా..!

ఇంటిని శుభ్రం చేసుకోవడం ఈజీ టాస్క్‌ కాదు. ముఖ్యంగా కార్పెట్‌ క్లీన్‌ చేయడం ఎంతో శ్రమతో కూడుకుని ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులువుగా పని పూర్తి చేసుకోవచ్చు. 


  • కార్పెట్‌ బాగా దుమ్ముపట్టి ఉంటే అలర్జీ లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కార్పెట్‌ను శుభ్రపరచుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా కార్పెట్‌ను క్లీన్‌ చేయడం వల్ల ఎక్కువ కాలం మన్నుతుంది. 

  • కార్పెట్‌ను ఎప్పటికప్పుడు వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల దుమ్ము, ధూళి ఉంటే తొలగిపోతుంది.

  • మరకలు పడినట్లయితే వీలైనంత త్వరంగా శుభ్రపరచుకోవాలి. ఎక్కువకాలం ఉన్నట్లయితే మరకలను శుభ్రం చేయడం కష్టమవుతుంది.

  • దుమ్ము, ధూళి ఇంట్లోకి ఎక్కువగా రాకుండా ఉండటం కోసం ప్రధాన ద్వారం దగ్గర మ్యాట్‌లను ఉపయోగించాలి. 

  • కార్పెట్‌పై పడ్డ మరకలను తొలగించడానికి ఏదైనా యాసిడ్‌ను ఉపయోగిస్తున్నట్లయితే ముందుగా పరీక్షించడం మంచిది. కొన్నిరకాల యాసిడ్‌ల వల్ల కార్పెట్‌ రంగు పోయే ప్రమాదం ఉంది.
  • డిటర్జెంట్లు, షాంపూలు ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు. డిటర్జెంట్ల ముక్కలు కార్పెట్‌లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది.

  • హాలులో ఉండే కార్పెట్‌ను, దుమ్ము ఎక్కువగా చేరే అవకాశం ఉన్న కార్పెట్‌ను మూడు, నాలుగు నెలలకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి. 

  • కార్పెట్‌ శుభ్రపరచుకోవడానికి మరొక పద్ధతి స్టీమ్‌ క్లీనింగ్‌. ఈ పద్ధతిని ఎంచుకున్నట్లయితే కార్పెట్‌ బాగా తడిగా ఉండకుండా చూసుకోవాలి. స్టీమ్‌ క్లీన్‌ చేసే ముందు బ్రష్‌ చేయడం కూడా మరవద్దు.

Updated Date - 2021-04-05T05:40:10+05:30 IST