వీడియో ప్లే కావడం లేదేం?

ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST

నా దగ్గర ఉన్న టీవీ సెట్‌ టాప్‌ బాక్స్‌లో రికార్డు చేసుకున్న వీడియో ఫైల్స్‌ ల్యాప్‌టాప్‌లోకి కాపీ చేస్తే ప్లే కావడం లేదు. పరిష్కారం సూచించగలరు...

వీడియో ప్లే కావడం లేదేం?

నా దగ్గర ఉన్న టీవీ సెట్‌ టాప్‌ బాక్స్‌లో  రికార్డు చేసుకున్న వీడియో ఫైల్స్‌ ల్యాప్‌టాప్‌లోకి కాపీ చేస్తే ప్లే కావడం లేదు. పరిష్కారం సూచించగలరు. 

- భాను మహేష్‌


సహజంగా సెట్‌ టాప్‌ బాక్స్‌లో ట్రాన్స్‌పోర్టబుల్‌ స్ట్రీమ్‌లో వీడియో రికార్డు అవుతుంటుంది. ఇది ఎన్‌క్రి్‌ప్ట చేసి లేకపోతే, నేరుగా ల్యాప్‌టా్‌పలోకి కాపీ చేసి లేదా ఫార్మాట్‌ ఫ్యాక్టరీ వంటి అప్లికేషన్‌ సాయంతో ఎంపీ 4 వంటి పాపులర్‌ వీడియో ఫైల్‌ ఫార్మాట్లోకి కన్వర్ట్‌ చేసి   ప్లే చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ వీడియో స్ట్రీమ్‌ డీటీహెచ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ చేత ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎన్కిప్ష్రన్‌ పద్ధతిలో ఎన్‌క్రి్‌ప్ట అయి ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేసినట్లు కేవలం ఫైళ్ళు కాపీ చేయటం వల్ల ప్రయోజనం ఉండదు. వాటిని కంప్యూటర్‌ డీక్రిప్ట్‌ చేయడానికి సాధ్యపడదు.


Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST