మీరు ధరించే దుస్తులపై ఉండే వివిధ రకాలైన స్టిక్టర్స్‌కు అర్థం ఏమిటో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-13T14:53:59+05:30 IST

మనం దుస్తులు కొనేటప్పుడు వాటిపై..

మీరు ధరించే దుస్తులపై ఉండే వివిధ రకాలైన స్టిక్టర్స్‌కు అర్థం ఏమిటో తెలుసా?

మనం దుస్తులు కొనేటప్పుడు వాటిపై వివిధ రకాలైన స్టిక్కర్లు కనిపిస్తాయి. వీటి అర్థాల గురించి మనకు అంతగా తెలియదు. అందుకే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

Bleaching symbols: 

బ్లీచింగ్ పౌడర్ బట్టలపై మరకలను తొలగించడానికి, మెరుపును పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే దుస్తుల బ్లీచింగ్ ప్రక్రియ మారుతూ ఉంటుంది. ఏ బట్టలను ఎక్కువగా బ్లీచ్ చేయవచ్చో, ఏది తక్కువ బ్లీచింగ్ చేయవచ్చో వివరించేందుకు వివిధ కంపెనీలు దుస్తులపై ఇటువంటి చిహ్నాలను స్టిక్కర్ల రూపంలో అతికిస్తాయి. ఉదాహరణకు ఒక సాధారణ త్రిభుజం స్టిక్కర్ ఉంటే ఆ ఫాబ్రిక్‌ను బ్లీచింగ్ చేయవచ్చు. త్రిభుజంలో క్రాస్ మార్క్ ఉంటే, బ్లీచింగ్ చేయకూడదని అర్థం. త్రిభుజంలో వికర్ణ రేఖలను ఉపయోగించినట్లయితే నాన్-క్లోరిన్ బ్లీచ్ చేయవచ్చని అర్థం.

Ironing Symbols:

బట్టలు ఇస్త్రీ చేయడానికి కూడా ఒక మార్గం ఉంది. ప్రతి బట్టను ఇస్త్రీ చేయలేం. స్టిక్కర్లలోని చిహ్నాల ద్వారా అ దుస్తులపై ఏమేరకు ఇస్త్రీ చేయవలసి ఉంటుందో తెలుస్తుంది. ఉదాహరణకు ఒక చుక్కతో కూడిన ఇస్త్రీ సింబల్ ఉంటే  తక్కువ వేడితో ఇస్త్రీ చేయాలని అర్థం. టూ డాట్ అంటే మీడియం, త్రీ డాట్ అంటే ఎక్కువ వేడితో ఇస్త్రీ చేయవచ్చు. క్రాస్ సింబల్.. ఆ వస్త్రాన్ని ఐరన్ చేయవలసిన అవసరం లేదని సూచిస్తుంది. 


Washing cycle symbols: 

దుస్తులు ఎక్కువకాలం మన్నాలి అనుకుంటాం కాబట్టి వాటిని ఎలా ఉతకాలో చిహ్నాల ద్వారా తెలియజేస్తారు. ఉదాహరణకు, సర్కిల్ మార్క్ ఉన్న దుస్తులను డ్రై క్లీన్ చేయాలని, ఇంట్లోని నీటితో ఉతకకూడదని అర్థం. వృత్తం ఆకారంలో గుర్తు ఉంటే దానిని జాగ్రత్తగా శుభ్రం చేయాలని అర్థం. వస్త్రాన్ని దాని ఫాబ్రిక్ ఆధారంగా శుభ్రం చేయడం ఉత్తమం. 

Drying symbols:

దుస్తులను ఆరబెట్టడానికి కూడా ఒక మార్గం ఉంది. చతురస్రం లోపల వృత్తం గుర్తు ఉంటే దానిని టంబుల్‌లో ఎండబెట్టవచ్చని సూచన. ఒకవేళ దీనితో పాటు క్రాస్ మార్క్ ఉంటే అలా ఆరబెట్టకూడదని అర్థం. దుస్తులపై ఉండే చిహ్నాల ఆధారంగా వాటిని ఆరబెట్టాలని దుస్తుల కంపెనీలు సూచిస్తుంటాయి. 

Updated Date - 2022-01-13T14:53:59+05:30 IST