డేటా రికవరీ సాధ్యమేనా?

ABN , First Publish Date - 2020-08-15T05:30:57+05:30 IST

నా మెమరీ కార్డు రెండు నెలల క్రితం ఫార్మాట్‌ అయింది. ఇప్పుడు నేను ఆ ఎస్‌డి కార్డు నుంచి డేటాని తిరిగి పొందవచ్చా? ...

డేటా రికవరీ సాధ్యమేనా?

నా మెమరీ కార్డు రెండు నెలల క్రితం ఫార్మాట్‌ అయింది. ఇప్పుడు నేను ఆ ఎస్‌డి కార్డు నుంచి  డేటాని తిరిగి పొందవచ్చా? 

- రాజేంద్ర


మీ మెమరీ కార్డులో, అదీ ఫ్మార్మాట్‌ అయిన తర్వాత ఈ రెండు నెలల్లో కొత్తగా ఎలాంటి డేటా కాపీ చేయకపోతే చాలావరకు డేటాను వెనక్కు తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కొత్తగా పెద్ద మొత్తంలో ఫైళ్లు, కాపీ చేసి, డిలీట్‌ చేసి ఉన్నట్లయితే తిరిగి వాటిని పొందే అవకాశం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే గతంలో డిలీట్‌ చేసిన డేటా మీద కొత్తగా మీరు సేవ్‌ చేసిన ఫైళ్లు రైట్‌ అవుతాయి. రెండు నెలల నుంచి మీ మెమరీ కార్డు వాడకుండా పక్కన పడేసినట్లయితే, ఖచ్చితంగా మీ డేటా వెనక్కు వస్తుంది. మీరు చేయవలసిందల్లా మీ మెమరీ కార్డుని కార్డ్‌ రీడర్‌ ద్వారా పీసీకి కనెక్ట్‌ చేసి, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కోసం అందుబాటులో ఉన్న అనేక ఉచిత లేదా పెయిడ్‌ డేటా రికవరీ అప్లికేషన్లు ప్రయత్నించాలి. యాక్టివ్‌ అన్‌డిలీట్‌, ఈసస్‌ డేటా రికవరీ వంటి అప్లికేషన్లు మీరు  ఎంచుకోవచ్చు.

Updated Date - 2020-08-15T05:30:57+05:30 IST