ఒత్తిడికి దూరంగా..!

ABN , First Publish Date - 2020-09-28T05:30:00+05:30 IST

ఆఫీసులో ఒత్తిడి ఎప్పుడూ ఉండేదే. అయితే ఆ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. ఇందుకోసం నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇవి...

ఒత్తిడికి దూరంగా..!

ఆఫీసులో ఒత్తిడి ఎప్పుడూ ఉండేదే. అయితే ఆ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. ఇందుకోసం నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇవి...


  1. ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం, చేస్తున్న పనిలో కొత్తదనం లేకపోవడం, ప్రమోషన్‌ రాకపోవడం వంటివన్నీ మెంటల్‌ స్ట్రెస్‌కు కారణమవుతాయి.
  2. చికాకుగా ఉండటం, వృత్తిలో సామర్థ్యం తగ్గిపోవడం, వర్క్‌పట్ల ఆసక్తి లేకపోవడం వంటివన్నీ స్ట్రెస్‌ను సూచిస్తాయి. 
  3. స్ట్రెస్‌ పెరుగుతోందని అనిపించినప్పుడు కారణాలు కనుక్కోవడం, పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేయాలి.
  4. మీ ప్రవర్తన వల్ల మీరే సమస్యలను సృష్టించుకుంటున్నారేమో ఎవరికి వారు ఒకసారి పరిశీలించుకోవాలి.
  5. ఆఫీస్‌ లోపల, బయటా మీకు సపోర్టివ్‌గా ఉండే వారితో మాట్లాడాలి. సమస్యలను వారితో షేర్‌ చేసుకోవాలి.
  6. ఎమోషన్‌ను తగ్గించుకోవాలి. మీటింగ్‌ ఉన్న రోజున ఐదు నిమిషాలు ముందే వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఫ్రీ టైమ్‌లో కొలీగ్స్‌తో సరదాగా ముచ్చటించాలి. ఇలా చేయడం వల్ల వర్క్‌ స్ట్రెస్‌ దరిచేరకుండా ఉంటుంది.

Updated Date - 2020-09-28T05:30:00+05:30 IST