మెడ వెనక నలుపు పోవాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి!

ABN , First Publish Date - 2021-11-10T17:56:02+05:30 IST

చాలా మందికి మెడ వెనక భాగం నల్లగా ఉంటుంది. జుట్టు ఎక్కువగా ఉన్నవారికి.. కాలర్‌ ఉన్న బట్టలు వేసుకొనేవారికి ఈ భాగం కనిపించదు కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నట్లు అనిపించదు. కానీ ఎప్పుడైనా

మెడ వెనక నలుపు పోవాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి!

ఆంధ్రజ్యోతి(10-11-2021)

చాలా మందికి మెడ వెనక భాగం నల్లగా ఉంటుంది. జుట్టు ఎక్కువగా ఉన్నవారికి.. కాలర్‌ ఉన్న బట్టలు వేసుకొనేవారికి ఈ భాగం కనిపించదు కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నట్లు అనిపించదు. కానీ ఎప్పుడైనా టీషర్టులు వేసుకోవాలన్నా.. మహిళలు జుట్టు ముడి వేసుకోవాలన్నా ఈ నల్లటి మెడ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు మెడ వెనక భాగం నల్లగా ఉండటానికి మూడు రకాల కారణాలు ఉంటాయి. వీటిలో మొదటిది మెడను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవటం. మధుమేహం, కొన్ని రకాల చర్మ వ్యాధుల వల్ల కూడా మెడ నల్లగా ఉంటుంది. కొన్ని సార్లు మందులు పడకపోవటం వల్ల కూడా మెడ మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. మెడ వెనక భాగం నల్లగా ఉన్నవారు ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే ఆ నలుపు తగ్గే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. 


ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మెడ వెనక భాగాన్ని శుభ్రంగా కడగాలి. నల్లటి మచ్చలు కనిపిస్తే సన్‌స్ర్కీన్‌ లోషన్‌ను రాసుకోవాలి. అలోవిరా, కొబ్బరినూనెలను కలిపి రాసినా ప్రయోజనం ఉంటుంది. 


మెడ వెనక భాగంలో చర్మం కమిలిపోయినట్లు ఉంటే- బరువైన ఆభరణాలు ధరించకూడదు. దీని వల్ల సమస్య మరింతగా పెరుగుతుంది. 


ఎక్కువ సార్లు రుద్దటం వల్ల మచ్చలు పోతాయనుకోవటం పొరపాటు. మచ్చలు ఉన్నవారు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి మందులు వాడాలి. 


బరువు తగ్గటం వల్ల కూడా కొన్ని సార్లు మచ్చలు పోతాయి. అందువల్ల మెడ మీద మచ్చలు ఉన్నవారు ముందుగా బరువు తగ్గితే మంచిది.

Updated Date - 2021-11-10T17:56:02+05:30 IST