Advertisement
Advertisement
Abn logo
Advertisement

sankranti Festivalకు ఇంటికెళ్లాం సరే.. తిరుగు ప్రయాణం ఎలా..!?

  • రైళ్లు, బస్సుల్లో బెర్తులు/సీట్లు ఫుల్‌ 
  • సువిధ స్పెషల్‌ రైలులో రూ.3 వేలు దాటిన త్రీటైర్‌ ఏసీ టిక్కెట్‌

గుంటూరు : సంక్రాంతి పండగకి వివిధ నగరాల నుంచి స్వస్థలాలకు వచ్చిన ప్రజలు తిరిగి వెళ్లడానికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదివరకే రైళ్లు, బస్సులు, విమానాలలో అడ్వాన్స్‌ టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకొన్న వారు తాపీగా ఉన్నా చివరి నిమిషంలో వచ్చిన ప్రజలకు ప్రయాణ కష్టాలు తలెత్తాయి. ఇప్పటికే రైళ్లలో రిజర్వుడ్‌ బోగీలలో టిక్కె ట్‌లు అన్ని బుకింగ్‌ అయిపోయాయి. కొన్ని రైళ్లలో కనీసం వెయిటింగ్‌ లిస్టు టిక్కెట్‌లు కూడా బుకింగ్‌ జరగని పరిస్థితి ఉత్పన్నమైంది. బస్సుల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో టిక్కెట్‌ ధరలు రెండు, మూడింతలు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు పెంచేశారు. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లలో 1.3 టిక్కెట్‌ ఛార్జీని వసూ లు చేస్తుండగా సువిధ స్పెషల్‌ రైళ్లలో మాత్రం.. ప్రైవేటు బస్‌ ఆపరేటర్లకు తీసిపోనన్న విధంగా మారిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే విమానాల్లోనూ సాదారణ రోజుల కం టే ఈ నెల 16వ తేదీన టిక్కెట్‌ ధరలు దాదాపుగా రెట్టింపు అయ్యాయి. 


హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి సంక్రాంతి పండగకి జిల్లాకు వచ్చిన వారు ఆదివారం మధ్యాహ్నం నుంచి తిరుగు ప్రయాణాలు ప్లాన్‌ చేసుకొన్నారు. ఆ రోజున మధ్యాహ్నం జన్మభూమి, నాగర్‌సోల్‌, లింగంపల్లి ఇంటర్‌సిటీ, విశాఖపట్టణం నుంచి వచ్చే రెండు ఏసీ ఎక్స్‌ ప్రెస్‌లు, నరసపూర్‌, చెన్నై, డెల్టా, నారాయణాద్రి, విశాఖ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లలో అన్ని తరగతుల టిక్కెట్‌లు రిజర్వు అయిపో యాయి. ప్రయాణీకుల సౌకర్యార్థం అంటూ రైల్వే శాఖ నరస పూర్‌ నుంచి సికింద్రాబాద్‌కి ఒక సువిధ స్పెషల్‌ రైలుని తీసుకొ స్తోంది. ఈ రైలులో టిక్కెట్‌, టిక్కెట్‌కి ధర పెరిగిపోతుంది. ఆ విధంగా ఇప్పటికే ఐదింతలు అదనంగా ఛార్జీలు(రూ.వెయ్యికి పైగా) చెల్లించి పులువరు స్లీపర్‌క్లాస్‌ టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకొన్నారు.

FILE PHOTO

ఏసీ త్రీటైర్‌ భోగీలో 36 బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ టిక్కెట్‌ ధర రూ.3,085కి చేరింది. ఏసీ టూటైర్‌లో 18 బెర్తులు ఖాళీగా ఉండగా టిక్కెట్‌ ఛార్జీ రూ.4,305కి చేరింది. బుకింగ్‌ చేసే సమయానికి ఈ ఛార్జీలు మరింత పెరుగుతాయి. ఇక విమానాల విషయానికి వస్తే సాదారణ రోజుల్లో గన్నవరం నుంచి హైదరాబాద్‌కు రూ.1,900 నుంచి రూ.2 వేలతో టిక్కెట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ నెల 16వ తేదీన మాత్రం టిక్కెట్‌ బుకింగ్‌ చేసుకోవాలంటే రూ.3,400 నుంచి రూ.4 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌టీసీ కూడా స్పెషల్‌ సర్వీసులపై ఛార్జీలను పెంచింది. ఇక ప్రైవేటు ఆపరేటర్లు రూ.వెయ్యి వరకు సూపర్‌లగ్జరీ బస్సుల్లో వసూలు చేస్తోన్నారు. 


ప్రజా రవాణా ఇలా ఉంటే కార్లలో వెళ్లదలుచుకొన్న వారు కూడా మరింత భారం మోయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. సాధారణ రోజుల్లో కిలోమీటర్‌కి రూ.12 వసూలు చేస్తారు. హైదరాబాద్‌కు తీసుకెళ్లి దిగబెట్టినందుకు రూ.5,500 తీసు కొంటారు. ఇప్పుడు అది రూ.7 వేల వరకు డిమాండ్‌ చేస్తోన్నా రు. అదేమంటే టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది, దీనివలన తాము రిటర్న్‌ రావడానికి చాలా సమయం పడు తుందని చెబుతున్నారు. కాగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం కూడా సెలవు పెట్టి ఆ రోజు రాత్రి/ మంగళవారం ఉదయం తిరుగు ప్రయాణం అయ్యేందుకు కొంతమంది సన్నద్ధమౌతున్నారు. 


గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా రెండు ప్రత్యేక రైళ్లను రెండు రోజులపాటు నడపను న్నట్లు రైల్వే గుంటూరు డివిజనల్‌ అధికారి తెలిపారు. నెంబరు. 07298 మచి లీపట్నం - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 17, 19 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.20కి గుంటూరు, 1.20కి సత్తెన పల్లి, 2.30కి నడికుడి, మరుసటి రోజు ఉదయం 6.50కి సికింద్రాబాద్‌ చేరు కొంటుంది. నెంబరు.07496 నరసాపూర్‌ - వికారాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 16, 18 తేదీల్లో రాత్రి 8.50 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 2 గంటలకు గుంటూరు, 2.40కి సత్తెనపల్లి, 3.15కి నడికుడి, మరుసటిరోజు ఉదయం 7.35కి సికింద్రా బాద్‌, 9.25కి వికారా బాద్‌ చేరుకొంటుంది. ఈ రైళ్లన్నీ రిజర్వుడ్‌ బోగీలతో నడు స్తాయని రైల్వే అధికారి తెలిపారు. 

Advertisement
Advertisement