గోళ్లు కొరకడం మానాలంటే...!

ABN , First Publish Date - 2020-10-07T06:02:40+05:30 IST

గోళ్లు ఎప్పటికప్పుడు చిన్నగా కత్తిరించుకోవాలి. తరచుగా మెనిక్యూర్‌ చేయించుకోవాలి. అందంగా ఉన్న గోళ్లను చూస్తే కొరకాలనిపించదు. గోళ్లు కొరకడానికి కాల్షియం లోపం కూడా ఒక కారణమై ఉంటుంది. కాబట్టి పోషకాహారంపై దృష్టి పెట్టాలి...

గోళ్లు కొరకడం మానాలంటే...!

  1. గోళ్లు ఎప్పటికప్పుడు చిన్నగా కత్తిరించుకోవాలి.  
  2. తరచుగా మెనిక్యూర్‌ చేయించుకోవాలి. అందంగా ఉన్న గోళ్లను చూస్తే కొరకాలనిపించదు.
  3. గోళ్లు కొరకడానికి కాల్షియం లోపం కూడా ఒక కారణమై ఉంటుంది. కాబట్టి పోషకాహారంపై దృష్టి పెట్టాలి. 
  4. గోళ్లకు నీమ్‌ పేస్ట్‌ లేదా మిరియాల పొడిని అద్దాలి. దాంతో గోళ్లు కొరకాలని అనిపించదు.
  5. ఒత్తిడిలో ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతుంటారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ప్రాణాయామం వంటివి సాధన చేయాలి.

Updated Date - 2020-10-07T06:02:40+05:30 IST