Advertisement
Advertisement
Abn logo
Advertisement

చలించిన HRC.. ‘ఆంధ్రజ్యోతి’ కథనం సుమోటోగా స్వీకరణ

  • 28 లోపు నివేదిక సమర్పించాలని నోటీసులు 

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు పడుతున్న ఇబ్బందులపై ‘చలి’oచరూ..! శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. ఉస్మానియా, గాంధీ, చెస్ట్‌, నిలోఫర్‌, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్‌ ఆస్పత్రుల్లో రోగులకు కప్పుకునేందుకు దుప్పట్లు లేని అంశాన్ని ఆంధ్రజ్యోతి లేవనెత్తింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలోని పరిస్థితిని కూడా వివరించింది. ఈ కథనాన్ని కమిషన్‌ బుధవారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నెల 28 లోపు నివేదిక సమర్పించాలని హెల్త్‌, మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీకి, తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement