రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాల్సిందే, తేల్చి చెప్పిన కేంద్రం

ABN , First Publish Date - 2020-07-13T19:15:12+05:30 IST

యూజీసీ సూచనలకు అనుగుణంగా రాష్ట్రాలు తప్పని సరిగా సెప్టెంబర్ నెలాఖరులో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం తేల్చి చెప్పింది.

రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాల్సిందే, తేల్చి చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: యూజీసీ సూచనలకు అనుగుణంగా రాష్ట్రాలు తప్పనిసరిగా సెప్టెంబర్ నెలాఖరులో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం తేల్చి చెప్పింది. యూజీసీ చేసిన సూచనపై రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు వ్యాఖ్యానించింది.‘సరైన సమయాన్ని చూసి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రాలు క్యాలెండర్ రూపొందించుకోవాలి. పూర్తిగా పరీక్షలను రద్దు చేయాలనడం ఆచరణ యోగ్యం కాదు’ అని మానవనరుల శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.


పరీక్షల ఫలితాలు ద్వారా విద్యార్థి సామర్థ్యం, నైపుణ్యాల స్థాయి బయటపడుతుందంటూ సదరు అధికారి కామెంట్ చేశారు. కరోనా కాలంలో పరీక్షలు నిర్వహించడం కష్టమని రాష్ట్రాలు చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాథాన్యాన్ని సంతరించుకున్నాయి. యూజీసీ మార్గదర్శకాలపై ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పరీక్షలపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే వదిలిపెడితే మంచిదని తమిళనాడు సీఎం కూడా అభిప్రాయపడ్డారు. ఇలా సర్వత్రా వ్యతిరేక స్వరం వినిపిస్తుండటంతో పరీక్షలు నిర్వహించాల్సిందేనని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.  

Updated Date - 2020-07-13T19:15:12+05:30 IST