Abn logo
Apr 9 2020 @ 21:14PM

‘కబీర్’ కోసం ఎలా కష్టపడ్డానంటే.. వీడియో విడుదల చేసిన హృతిక్

ముంబై: గత ఏడాది విడుదలైన ‘వార్’ అనే సినిమాలో కబీర్ అనే పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్ .. ఆ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడనే విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. 2013-14లలో విడుదలైన క్రిష్, బ్యాంగ్-బ్యాంగ్ సినిమాలలో హృతిక్ మంచి ఫిజిక్‌తో కనిపించారు. కానీ ఆ తర్వాత ఆయన నటించిన సినిమాల్లో బాడీ ఫిజిక్‌తో సంబంధం లేదు. అంతేకాక.. గత ఏడాది విడుదలైన ‘సూపర్ 30’ అనే సినిమాలో తనకున్న హ్యాండ్‌సమ్ ఇమేజీని పక్కన పెట్టిన హృతిక్ ఓ సాధారణ ఉపాధ్యాయుడి పాత్రలో నటించారు. అయితే ఆ తర్వాత ఆయన ‘వార్’ చిత్రంలో ఆర్మీ అధికారిగా నటించాల్సి రావడంతో.. తిరిగి బాడీని మళ్లీ ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇందుకు ఆరు నెలలు మాత్రమే సమయం ఉండటంతో హృతిక్ ఎంతో కృషి చేశారు. తన కష్టానికి సంబంధించిన వీడియోని ‘కబీర్ అండ్ బియాండ్’ అనే పేరుతో ‘హెచ్‌ఆర్‌ఎక్స్ ఫిలిమ్స్’ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. 


11 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో హృతిక్ వర్కవుట్ చేయడం.. పాఠాలు నేర్చుకోవడం చూపించడంతో పాటు.. ఆ వర్కవుట్ సమయంలో ఎదురుకున్న అనుభవాలను పంచుకున్నారు.


తన బాడీని మళ్లీ ఫిట్‌గా మార్చుకొనేందుకు ఎంతో కష్టపడ్డానని తెలిపిన ఆయన.. టైగర్‌ ష్రాఫ్‌ తనతో కలిసి నటించడం తనకు ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు. నా గాయల కారణంగా ఫిట్‌గా మారడం ఎంతో కష్టతరమైంది అని హృతిక్ పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement