Advertisement

Aryan Khan case: అదే నిజమైతే.. చాలా విషాదకరమంటున్న Hrithik Roshan!

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ ఈ రోజు (గురువారం) ముంబై హైకోర్టులో జరగనుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసి.. `ఇదే నిజమైతే.. నిజంగా చాలా బాధాకరం` అని కామెంట్ చేశాడు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని జర్నలిస్ట్ ఫాయే డిసౌజ చేసిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ అది. 


ఆ ఇంటర్వ్యూలో ఆర్యన్ బెయిల్ పిటిషన్ గురించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్వంత్ దవే స్పందించారు. ఆర్యన్ ఖాన్ స్నేహితుడు అర్భాజ్ మర్చెంట్ కంటే ఎక్కువ మొత్తంలో డ్రగ్స్‌తో పట్టుబడినప్పటికీ గతంలో ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఎలా లభించిందో ఆయన చెప్పారు. అలాగే ఆర్యన్ ఖాన్ తరహాలోనే గతంలో అరెస్ట్ అయిన ఒక నిందితుడికి గతంలో బెయిల్ సులభంగా లభించినట్టు తెలిపారు. ఈ వీడియోను హృతిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. గతంలో కూడా ఆర్యన్‌కు మద్దతుగా హృతిక్ ఓ లేఖను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Bollywoodమరిన్ని...