హువేయి స్మార్ట్ స్క్రీన్ వీ 75 సూపర్ స్మార్ట్ టీవీ..

ABN , First Publish Date - 2021-08-12T23:40:04+05:30 IST

చైనీస్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ హువేయి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.

హువేయి స్మార్ట్ స్క్రీన్ వీ 75 సూపర్ స్మార్ట్ టీవీ..

న్యూఢిల్లీ: చైనీస్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ హువేయి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. 4కే మినీ-ఎల్ఈడీ డిస్‌ప్లేతో హువేయి స్మార్ట్ స్క్రీన్ వీ 75 సూపర్ స్మార్ట్ టీవీని విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. హువేయి స్మార్ట్ స్క్రీన్ వీ 75 సూపర్ స్మార్ట్ టీవీ ధర రూ. 2,87,700 ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఆగస్టు 12 నుంచి టీవీల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 18 నుంచి స్మార్ట్ స్పీకర్లను ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.

Updated Date - 2021-08-12T23:40:04+05:30 IST