భూమికి పొంచి ఉన్న ముప్పు.. దూసుకువస్తున్న పెను ఉపద్రవం.. నాసా హెచ్చరిక!

ABN , First Publish Date - 2022-01-05T22:55:42+05:30 IST

న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ భవనం కంటే రెండున్నర రెట్లు పెద్దదైన గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకు వస్తోంది.

భూమికి పొంచి ఉన్న ముప్పు.. దూసుకువస్తున్న పెను ఉపద్రవం.. నాసా హెచ్చరిక!

న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ భవనం కంటే రెండున్నర రెట్లు పెద్దదైన గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకు వస్తోంది. భూకక్ష్య వైపుగా దూసుకువస్తోన్న ఆ భారీ గ్రహ శకలానికి `1994 పీసీ`గా నామకరణం చేశారు. ఈ గ్రహశకలాన్ని ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. ఈ గ్రహశకలం ఈ నెల 18వ తేదీన భూమికి అత్యంత సమీపంలోకి రానున్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.


ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. జనవరి 18, 2022న భూమికి 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనున్నట్టు నాసా అంచనా వేసింది. ఈ గ్రహశకలం పరిమాణం భారీగా ఉండటం, భూమికి సమీపంలోకి వస్తుండడం వల్ల నాసా దీనిని ప్రమాదకరమైన గ్రహశకలంగా గుర్తించింది. దీని వల్ల భూ కక్ష్యలో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-01-05T22:55:42+05:30 IST