Advertisement
Advertisement
Abn logo
Advertisement

India vs Sri Lanka: భారత జట్టులో భారీ మార్పులు!

కొలంబో: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య రేపు(శుక్రవారం) తుది వన్డే జరగనుంది. తొలి రెండు వన్డేలను గెలుచుకున్న భారత యువ జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రేపటి వన్డేలో జట్టులో భారీ మార్పులు చేయనున్నట్టు సమాచారం. ఓపెనర్ పృథ్వీషాకు విశ్రాంతి ఇచ్చి దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్‌లలో ఒకరిని ధవన్‌కు తోడుగా పంపే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండేలను కొనసాగించి, కీపింగ్ బాధ్యతలను మోస్తున్న ఇషాన్ బదులు సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది.


వన్డే సిరీస్ ముగిసిన వెంటనే టీ20 సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి హార్దిక్‌ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతి ఇవ్వొచ్చు. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్‌కు బదులుగా రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్‌కు తుది జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. అలాగే, దీపక్ చాహర్ స్థానంలో నవదీప్ సైనీని కానీ, చేతన్ సకారియా కానీ జట్టులోకి రావొచ్చని అంటున్నారు.

Advertisement
Advertisement