Abn logo
Jul 8 2020 @ 04:25AM

ఇళ్లస్థలాల కొనుగోళ్లలో భారీ అవినీతి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు 


మచిలీపట్నం టౌన్‌, జూలై 7 : పేదలకు ఇచ్చే ఇళ్లస్థలాల భూముల కొనుగోళ్లలో వైసీపీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని, రూ.1560 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. మంగళవారం తన కార్యాలయం వద్ద విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఇళ్లపట్టాల పంపిణీలో దాదాపు రూ.3161 కోట్ల ప్రజాధనం దుర్వినియోగ మైందన్నారు.


టీడీపీ హయాంలో 6లక్షల జీప్లస్‌ 3 ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 19 లక్షల ఇళ్లు నిర్మించా మని ఏడాదైనా వాటిని పేదలకు ఇవ్వలేదన్నారు. జీప్లస్‌ 3 ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు. ఇళ్లపట్టాలు ఇస్తామని పేదలను మూడుసార్లు మోసం చేశారన్నారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి. ఫణికుమార్‌ మాట్లాడుతూ పేదలకు వెంటనే ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నారు.

Advertisement
Advertisement
Advertisement