డీమార్ట్‌ లాభంలో భారీ క్షీణత

ABN , First Publish Date - 2020-10-18T06:43:19+05:30 IST

కరోనా మహమ్మారి ప్రభావం వల్ల డీమార్ట్‌ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌ కన్సాలిడేటెడ్‌ నికరలాభం గత ఏడాది రెండో త్రైమాసికంతో పోల్చితే 38.39

డీమార్ట్‌ లాభంలో భారీ క్షీణత

కరోనా మహమ్మారి ప్రభావం వల్ల డీమార్ట్‌ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌ కన్సాలిడేటెడ్‌ నికరలాభం గత ఏడాది రెండో త్రైమాసికంతో పోల్చితే 38.39 శాతం క్షీణించి రూ.199 కోట్లకు దిగజారింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ లాభం రూ.323 కోట్లు.


ఇదే కాలంలో ఆదాయం రూ.5991 కోట్ల నుంచి రూ.5306 కోట్లకు తగ్గింది. స్టాండ్‌ అలోన్‌ ఆదాయం రూ.5218 కోట్లు కాగా లాభం రూ.211 కోట్లు. ఇదే సమయంలో ఎబిటా మార్జిన్‌ రూ.517 నుంచి రూ.330కి పడిపోయింది.

వస్తుసేవల డిమాండు మహమ్మారి ముందు సమయం నాటికి క్రమంగా పుంజుకుంటున్నట్టు కంపెనీ సీఈఓ నెవిల్లీ నోరోన్హా తెలిపారు. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండు అద్భుతంగా ఉన్నట్టు ఆయన చెప్పారు.


Updated Date - 2020-10-18T06:43:19+05:30 IST