మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి హీరోహీరోయిన్లుగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన చిత్రం `ఉప్పెన`. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. పలువురు స్టార్ హీరోల కలెక్షన్ల రికార్డులను కూడా బద్దలుగొట్టింది. ప్రస్తుతం వంద కోట్ల రూపాయల కలెక్షన్ల దిశగా సాగుతోంది.
ఈ బ్లాక్‌బస్టర్ సినిమా త్వరలోనే ఓటీటీలో కూడా అందుబాటులోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధర చెల్లించిందట. దాదాపు రూ.7 కోట్లు వెచ్చించి ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి `ఉప్పెన` నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా హిందీ, తమిళ భాషల్లోకి కూడా త్వరలో రీమేక్ కాబోతోంది.