ఎల్‌ఐసీ ఐపీఓపై భారీ అంచనాలు

ABN , First Publish Date - 2022-01-13T07:53:58+05:30 IST

పబ్లిక్‌ ఇష్యూకి ముందే ఎల్‌ఐసీ ఐపీఓపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.15 లక్షల కోట్లుండేలా చూడాలని ప్రభు త్వం..

ఎల్‌ఐసీ ఐపీఓపై భారీ అంచనాలు

రూ.15 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ !


ముంబై : పబ్లిక్‌ ఇష్యూకి ముందే ఎల్‌ఐసీ ఐపీఓపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.15 లక్షల కోట్లుండేలా చూడాలని ప్రభు త్వం ఆశిస్తున్నట్టు సమాచారం. ఎల్‌ఐసీ ప్రస్తుత ఆస్తులు, భవిష్యత్‌ లాభాల విలువకు ఇది దాదాపు నాలుగు రెట్లు. అదే జరిగితే భారత క్యాపిటల్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ తర్వాత ఎల్‌ఐసీ అతి పెద్ద మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీగా అవత రిస్తుంది. ప్రస్తుతం రూ.17 లక్షల కోట్లతో రిలయన్స్‌, రూ.14.3 లక్షల కోట్లతో టీసీఎస్‌ భారత స్టాక్‌ మార్కెట్‌లో అతి పెద్ద కంపెనీలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఆశిస్తున్నట్టు మదుపరులు ఆదరిస్తే టీసీఎస్‌ను పక్కకు నెట్టి ఎల్‌ఐసీ, రెండో అతి పెద్ద  కంపెనీ గా అవతరించనుంది. ఎల్‌ఐసీ ఐపీఓ కోసం ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సెబీకి దరఖాస్తు చేయాలని భావిస్తున్నారు. మార్చిలోగా మార్కెట్‌కు వచ్చే ఈ బాహుబలి ఐపీఓ భారత క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలో అతి పెద్ద ఐపీఓ కానుంది. 

Updated Date - 2022-01-13T07:53:58+05:30 IST