బ్యాంకుల వద్ద భారీ క్యూ

ABN , First Publish Date - 2020-04-09T10:43:42+05:30 IST

బ్యాంకుల వద్ద జ న్‌ధన్‌ మహిళా ఖాతాదారులు భారీగా క్యూ కడుతున్నా రు.

బ్యాంకుల వద్ద భారీ క్యూ

పెద్దఎత్తున వచ్చిన   జన్‌ధన్‌ మహిళాఖాతాదారులు..

పలుచోట్ల కనిపించని భౌతికదూరం..


అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 8: బ్యాంకుల వద్ద జ న్‌ధన్‌ మహిళా ఖాతాదారులు భారీగా క్యూ కడుతున్నా రు. టవర్‌క్లాక్‌ సమీపాన గల కెనరా బ్యాంకు వద్ద మా త్రం గుంపులుగుంపులుగా కనిపించారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నిబంధనలకు నీళ్లొదిలారు. జన్‌ధన్‌ఖాతా కలిగి న మహిళలకు ప్రధానమంత్రి గరీబ్‌ యోజన కింద ప్ర త్యక్ష నగదు బదిలీలో భాగంగా రూ.500 ప్రభుత్వ జమ చేసింది.


ఆయా బ్యాంకుల్లో విత్‌డ్రా చేసుకోవాలని ప్రకటించింది. లబ్ధిదారులు మొదటి నాలుగు రోజులు ఆసక్తి చూపలేదు. బుధవారం పెద్దఎత్తున తరలివచ్చారు. జి ల్లాలో 4.38 లక్షల జన్‌ధన్‌  మహిళా ఖాతాదారులున్నారు. అధికారుల లెక్కల ప్రకారం 2 లక్షల మందికిపైగా నగదు విత్‌డ్రా చేసుకున్నారు. కొందరు ఏటీఎంలలో డ్రా చేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. పలు బ్యాంకుల వద్ద భౌతికదూరం పాటించకపోవటం శోచనీయం.

Updated Date - 2020-04-09T10:43:42+05:30 IST