Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 23 2021 @ 18:05PM

వ్యవసాయ సహకార సంఘంలో భారీ స్కాం

సిద్దిపేట: చేర్యాల వ్యవసాయ సహకార సంఘంలో భారీస్కాం వెలుగుచూసింది. రైతుల వద్ద తాలు, తరుగు పేరుతో బస్తాకు 5కిలోల మేర కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.2కోట్ల 65 లక్షల మేర స్కాం జరిగినట్లు పీఏసీఎస్ డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. రైసుమిల్ యజమానులు, పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్ల బంధువుల బ్యాంక్ ఖాతాల్లో ధాన్యం నగదును జమ చేశారు. ధాన్యం కొనుగోల్ల అవకతవకలపై జిల్లా సివిల్ సప్లయిస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. చేర్యాల, కొమురవెళ్లి మండల్లోని పలు గ్రామాల్లో సుమారు 65 మందిని విచారించినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement