పాక్‌కు భారీ షాక్‌..!

ABN , First Publish Date - 2021-09-18T07:45:24+05:30 IST

పద్దెనిమిదేళ్ల తర్వాత పాక్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ జట్టు ఆఖరి నిమిషంలో టూర్‌ను రద్దు చేసుకుంది.

పాక్‌కు భారీ షాక్‌..!

ఆటగాళ్ల భద్రతపై అనుమానం

పాక్‌ టూర్‌ను రద్దు చేసుకున్న న్యూజిలాండ్‌

రావల్పిండి: పద్దెనిమిదేళ్ల తర్వాత పాక్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ జట్టు ఆఖరి నిమిషంలో టూర్‌ను రద్దు చేసుకుంది. ఆటగాళ్ల భద్రతా కారణాల రీత్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి పాక్‌తో జరిగే సిరీ్‌సలో కివీస్‌ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, రావల్పిండిలో మధ్యాహ్నం ఆరంభం కావాల్సిన తొలి వన్డే కొద్దినిమిషాల్లో మొదలవాల్సివుండగా భద్రతా కారణాల రీత్యా సిరీ్‌సను రద్దు చేసుకొంటున్నట్టు న్యూజిలాండ్‌ క్రికెట్‌ సీఈవో డేవిడ్‌ వైట్‌ ప్రకటించాడు.


న్యూజిలాండ్‌ నిర్ణయంపై పీసీబీ కొత్త చీఫ్‌ రమీజ్‌ రాజా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశాడు. తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చే నెల 13, 14న రెండు టీ20ల సిరీస్‌ కోసం పాక్‌ పర్యటనకు వెళ్లాల్సిన ఇంగ్లండ్‌ ఆలోచనలో పడింది. ఒకటి రెండు రోజుల్లో తమ నిర్ణయం వెల్లడిస్తామని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. డిసెంబరులో వెస్టిండీస్‌, వచ్చే ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా టీమ్‌లు పాక్‌లో పర్యటించాల్సి ఉంది. అర్ధంతరంగా టూర్‌ను రద్దు చేసుకున్న కివీ్‌సపై పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ విరుచుకుపడ్డాడు. పాకిస్థాన్‌ క్రికెట్‌ను న్యూజిలాండ్‌ హత్య చేసిందని ఘాటుగా ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2021-09-18T07:45:24+05:30 IST