Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిన్న శిర్లాంలో వైసీపీకి భారీ షాక్‌


కోండ్రు సమక్షంలో వందలాది మంది టీడీపీలో చేరిక

రేగిడి, నవంబరు 28: చిన్నశిర్లాం వైసీపీ ప్రధాన నాయకుడు, ఇటీవల సర్పంచ్‌గా పోటీ చేసిన మజ్జి శ్రీనివాసరావు, వార్డు మెంబర్లు, వందలాది మంది అనుచరులు ఆదివారం టీడీపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌, మండల  పార్టీ అధ్యక్షుడు  కిమిడి అశోక్‌బాబు కండువాలు వేసి ఆహ్వానించారు. జగన్‌ పాలన నచ్చక, గ్రామంలో అభివృద్ధి కుంటుపడడంతో టీడీపీలో చేరినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కోండ్రు మురళి మాట్లాడుతూ.. జగన్‌ ప్రభు త్వం రెండున్నరేళ్లలో ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. అందువల్లే ప్రజలు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం వెనకడుగు వేయగా, అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయిందని, సంక్షేమం పేరుతో పాలన కుంటుపడిందని ఆరోపించారు. బూతు మంత్రులతో అసెంబ్లీని భ్రష్టు పట్టించారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్నది టీడీపీ ప్రభుత్వ మేనని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో రేగిడి, వంగర, రాజాం, సంతకవిటి మండల పార్టీ ప్రతినిధులు జడ్డు విష్ణుమూర్తి, గురవాన నారాయణరావు,  ఎం,జగన్మోహనరావు, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు మంతిని ఉషారాణి, కర్ణేణ మహేశ్వరరావు, గురవాన రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా చిన్న శిర్లాం వైస్‌ ఎంపీపీ స్వగ్రామం కావడం, అక్కడే వైసీపీకి షాక్‌ తగలడం విశేషం.

 

Advertisement
Advertisement