హ్యుమా ఖురేషీ హాలీవుడ్‌ పోస్టర్‌

ABN , First Publish Date - 2021-05-02T05:57:51+05:30 IST

బద్లాపూర్‌, జాలీ ఎల్‌ఎల్‌బీ2 వంటి సినిమాలతో అభిమానులను అలరించిన హ్యుమా ఖురేషీ హాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు...

హ్యుమా ఖురేషీ హాలీవుడ్‌ పోస్టర్‌

బద్లాపూర్‌, జాలీ ఎల్‌ఎల్‌బీ2 వంటి సినిమాలతో అభిమానులను అలరించిన హ్యుమా ఖురేషీ హాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఆమె హాలీవుడ్‌లో మొదటిసారి నటించిన ‘ఆర్మీ ఆఫ్‌ ద డెడ్‌’ సినిమాలో తన పాత్ర మోషన్‌పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అంతేకాదు ఆ సినిమా మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుందని పోస్ట్‌ చేశారామె. జాక్‌ స్నిడర్‌ అనే అమెరికా దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదలైంది. అయితే అందులో హ్యుమా ఖురేషి కనిపించలేదు. ‘‘ప్రస్తుతం కరోనాతో దేశం పోరాడుతున్న తీరు, ప్రతిరోజు ప్రజలు ఎంతో వేదనకు గురవ్వడం చూస్తుంటే నా హృదయం ద్రవిస్తోంది. ఈ సినిమాలో నా నటనను కరోనాతో పోరాడుతున్న వారికి అంకితం చేస్తున్నా. కరోనా బారిన పడ్డ వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు హ్యుమా ఖురేషీ. 


Updated Date - 2021-05-02T05:57:51+05:30 IST