మనిషిని చంపిన మొసళ్లు.. కడుపులో అవశేషాలు కనిపించడంతో..

ABN , First Publish Date - 2021-02-16T23:14:44+05:30 IST

ముసలి కడుపులో మనిషి అవశేషాలు కనిపించడం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కలకలం రేపుతోంది. ఇది భారీ ముసలి కావడం, అందులోనూ అదే ప్రాంతంలో ఓ వ్యక్తి కనిపించకుండా పోవడంతో అనేక అనుమానాలు..

మనిషిని చంపిన మొసళ్లు.. కడుపులో అవశేషాలు కనిపించడంతో..

ఇంటర్నెట్ డెస్క్: ముసలి కడుపులో మనిషి అవశేషాలు కనిపించడం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కలకలం రేపుతోంది. ఇది భారీ ముసలి కావడం, అందులోనూ అదే ప్రాంతంలో ఓ వ్యక్తి కనిపించకుండా పోవడంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం.. స్థానికంగా 69 ఏళ్ల మత్స్యకారుడు కొద్ది రోజులుగా కనిపించడం లేదు. అతడి కోసం వెదుకుతున్న క్రమంలో దగ్గరలోని జలాల్లో ఉన్న రెండు భారీ ముసళ్లను గుర్తించిన అధికారులు వాటిని చంపేశారు. అందులో ఓ ముసలి ఏకంగా 13.8 అడుగుల పొడవుంది. దీని కడుపులోనే మనిషికి సంబంధించిన అవశేషాలు కనిపించాయి. దీంతో ఈ ముసళ్లే అతడిని చంపి ఉండవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-02-16T23:14:44+05:30 IST