Advertisement
Advertisement
Abn logo
Advertisement

మానవహక్కుల కమిషన్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ

అమరావతి: రాష్ట్రంలో మానవహక్కుల కమిషన్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో 2017లో మానవ హక్కుల కమిషన్ అమరావతిలో ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్ ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఇటీవల క్యాబినెట్ మానవహక్కుల కమిషన్‌ను కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, క్యాబినేట్ తీర్మానంతో నోటిఫికేషన్‌ను మారుస్తున్నామని, ఈరోజు, రేపటిలో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేస్తుందని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. కేసు విచారణను నాలుగు వారాలకు  ధర్మాసనం వాయిదా వేసింది.

Advertisement
Advertisement