పరిమళించిన మానవత్వం

ABN , First Publish Date - 2021-05-14T04:52:23+05:30 IST

బంధాలు, అనుబంధాలను కరోనా తెంచేస్తోంది. అయిన వారున్నా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిం చడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి.

పరిమళించిన మానవత్వం
పీలేరులో అంత్యక్రియలు నిర్వహిస్తున్న మేముసైతం సమాజం కోసం ఫౌండేషన్‌ సభ్యులు

పీలేరు, మే 13: బంధాలు, అనుబంధాలను కరోనా తెంచేస్తోంది. అయిన వారున్నా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిం చడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. అయితే కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించడానికి మేమున్నాం అటూ ముందుకొచ్చింది ‘మేము సైతం సమాజం కోసం’ ఫౌండేషన్‌.  పీలేరులోని గడియారాల దుకాణ యజమాని కరోనాబారిన పడి బుధవారం మృతి చెందారు. అంత్యక్రియల నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కుటుంబసభ్యుల సమాచారం మేరకు ‘మేముసైతం సమాజం కోసం’ ఫౌండేషన్‌ సభ్యులు అంత్యక్రియలకు ముందు కొచ్చారు.  మృతదేహాన్ని బుధవారం రాత్రి స్థానిక బిలాల్‌ మసీదు సమీపంలోని పెద్ద ఖబరస్తాన్‌లో ముస్లింల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు.  

వాల్మీకిపురం: వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి  గ్రామానికి  చెందిన అబ్దుల్‌ మునాఫ్‌(40) కరోనాతో గురువారం మృతి చెందారు. మేముసైతం సమాజం కోసం ఫౌండేషన్‌ సభ్యులు అంత్యక్రియలు జరిపించారు. ఈ కార్యక్రమాల్లో ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు షాహీన్‌షా, సభ్యులు ఆర్టీసీ నాగూర్‌, గ్యాస్‌ షఫీ, కలకడ బాబు, జావీద్‌, సయ్యద్‌బాషా, షేక్‌ముబారక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-14T04:52:23+05:30 IST