Abn logo
Jun 11 2021 @ 19:38PM

మతం కంటే మానవత్వం గొప్పది: నారా భువనేశ్వరి

అమరావతి: మతం కంటే మానవత్వం గొప్పదని మాజీ సీఎం చంద్రబాబు సతీమణీ నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. కరోనా విపత్తులో పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ నిలిచిందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై భువనేశ్వరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిపుణులైన వైద్యులతో ఆన్‌లైన్‌లో వైద్యసేవలు అందిస్తున్నామని, 782 మందికి పైగా సేవలు అందించగా, 480 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవావిభాగం ఆధ్వర్యంలో అనాధలకు అంతిమ సంస్కారాలు చేస్తున్నామని చెప్పారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. 24/7 కాల్ సెంటర్‌తో అత్యవసర సమయంలో భరోసా ఇస్తున్నామని భువనేశ్వరి చెప్పారు.

Advertisement